మెగాబ్రదర్ నాగబాబు టీవీ షోలకు జడ్జ్ గా, జనసేన పార్టీ నాయకుడుగా ఉండడంతో.. సోషల్ మీడియాలో యమా యాక్టీవ్ గా ఉంటుంటారు. తన మనసులో ఆలోచనలను, అభిప్రాయాలను సోషల్ మీడియా ద్వారా పంచుకుంటుంటారు. ఎవర్నైనా విమర్శించాలన్నా.. అభినందించాలన్నా.. సోషల్ మీడియా ద్వారానే చేస్తుంటారు. జబర్థస్త్ షోతో ఈమధ్య బాగా పాపులర్ అయిన నాగబాబు ప్రస్తుతం అదిరింది షోకి జడ్జ్ గా వ్యవహరిస్తున్నారు.
ఇదిలా ఉంటే.. సోషల్ మీడియాలో బాగా యాక్టివ్‌గా ఉండే నాగబాబు పప్పులో కాలేశాడని అంటున్నారు నెటిజన్స్. ఇంతకీ విషయం ఏంటంటే.. జనవరి 6న సంగీత సంచలనం ఎ.ఆర్.రెహమాన్ పుట్టినరోజు. ఈ సందర్భంగా నాగబాబు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేశారు. అలాగే క్రికెట్ లెజెండ్ కపిల్ దేవ్ పుట్టినరోజు కూడా అని తెలిసింది. దీంతో నాగబాబు కపిల్ దేవ్ కు కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియచేశారు.
ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ.. కపిల్ దేవ్ ఫోటోను షేర్ చేయాల్సింది పోయి ఓ సినీ హీరో ఫోటోను షేర్ చేసి తప్పులో కాలేశారు. అదేంటంటారా..? బాలీవుడ్ నటుడు రణ్‌వీర్ సింగ్ 83 టైటిల్ తో సినిమా చేస్తున్నారు. ఇది కపిల్ దేవ్ బయోపిక్. ఈ సినిమా పోస్టర్‌ను నాగబాబు షేర్ చేశారు. దీంతో నెటిజన్స్ ఇదే టైమ్ అనుకున్నారో ఏమో కానీ.. నాగబాబును ఓ రేంజ్‌లో ట్రోల్ చేశారు. అదీ సంగతి.
Must Read ;- ‘జబర్థస్త్’ లోకి నాగబాబు రీ ఎంట్రీ.. నిజమేనా?











