ఎర్లియర్ గా ‘మాస్టర్’ సినిమాతో తమిళ నాట సంచలనం సృష్టించాడు దళపతి విజయ్ . దాదాపు రూ. 200కోట్లు కలెక్ట్ చేసి .. కోలీవుడ్ వర్గాల వారిని ఆశ్చర్యపరిచింది సినిమా. ఇప్పుడు అతడి 65వ సినిమాకి సమయం ఆసన్నమైంది. దళపతి 65గా వ్యవహరిస్తున్న ఈ సినిమాకి నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకుడు. నయనతార తో ‘కోలమావు కోకిల’ ( తెలుగులో కోకో కోకిల) అనే సినిమా తీసి.. తొలి ప్రయత్నంలోనే సూపర్ హిట్టు కొట్టిన నెల్సన్ .. ప్రస్తుతం శివ కార్తికేయన్ హీరోగా ‘డాక్టర్’ అనే మెడికల్ థ్రిల్లర్ ను రూపొందిస్తున్నాడు. ఆ సినిమా ఇంకా విడుదల కాకుండానే.. ఏకంగా విజయ్ తో సినిమా చేసే ఛాన్స్ కొట్టేశాడు.
సన్ పిక్చర్స్ నిర్మాణంలో రూపొందుతోన్న దళపతి 65 మూవీ నేడు పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. విజయ్ తో కొత్త ప్రయాణం ప్రారంభమవుతోంది. ఆయనలాంటి స్వీటెస్ట్ హీరోతో పనిచేయడం చాలా ఆనందంగా ఉంది అంటూ దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా తెలియచేశాడు. అతి త్వరలోనే సినిమా రెగ్యులర్ షూటింగ్ కు వెళ్ళబోతోంది. మరి నెల్సన్ .. బంగారం లాంటి ఈ అవకాశాన్ని ఎలా సద్వినియోగం చేసుకుంటాడో చూడాలి.
Must Read ;- ‘మాస్టర్’ రికార్డు ను మటాష్ చేసిన ‘జాతిరత్నాలు’
New journey starts today #Thalapathy65 feeling blessed to work with the sweeetesssssst @actorvijay sirrr 🤗🤗😘 and @sunpictures 🙏🙏😊 #Thalapathy65Poojai https://t.co/YDj83TujUg
— Nelson Dilipkumar (@Nelsondilpkumar) March 31, 2021










