సినిమా తారల వ్యక్తిగత జీవితాలంటే అందరికీ ఆసక్తే. ఎవరు ఎవర్ని ప్రేమించారు? ఎవరు ఎవపట్టరితో తిరుగుతున్నారు? ఎవరు ఎవరిని పెళ్లి చేసుకున్నారు?.. లాంటి ప్రశ్నలు ఎన్నో వస్తుంటాయి.
సినిమా తారలు పెళ్లి చేసుకుని సుఖవంతమైన వివాహ జీవితాన్ని గడుపుతున్నవారు చాలా తక్కువమంది ఉన్నారు. పెళ్లిళ్లు చేసుకోవడం.. ఆ తర్వాత విడిపోవడం సర్వసాధారణంగా జరుగుతుంటుంది. నాటి నుంచి నేటి వరకూ చూస్తే ఓ భానుమతి, ఓ జమున లాగా ఎలాంటి పొరపొచ్చాలు లేకుండా వైవాహిక జీవితాన్ని గడిపిన వారు అరుదు. ఇలా పెటాకులుగా మారిన వైవాహిక జీవితాలు సామాన్య ప్రజల్లోనూ ఎక్కువగా ఉన్నా వారి గురించి మాట్లాడుకునే వారు అరుదు.
సినిమా తారల వైవాహిక జీవితంలో ఏమైనా తేడాలు వస్తే మీడియాలో ఆ వార్త వైరల్ గా మారుతుంది. నిన్ననే ప్రియమణి భర్త గురించి వార్త బయటికి వచ్చింది. అంతకుముందు అమలా పాల్ మీద అలాగే వార్తలు వచ్చాయి. ఇటీవల అలనాటి మంజుల కుమార్తె వనిత మూడో పెళ్లిపై వార్తలు వైరల్ అయ్యాయి. సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడుకోకుండా జనం ఉండలేరు.

పెళ్లియిన వారినే భర్తలుగా..
సినిమా హీరోయిన్లు పెళ్లియిన వారినే భర్తలు ఎందుకు ఎంచుకుంటారన్నది ఎవరికీ అర్థం కాని ప్రశ్న. మహానటి సావిత్రి నుంచి నేటి ప్రియమణి వరకూ ఇదే బాటలో తారలు పయనిస్తున్నారు. ఎవరికైనా మొదటి ప్రాధాన్యం డబ్బుకే ఉంటుంది. మంచితనం అనేది ఆఖరి ప్రాధాన్యం మాత్రమే. తమ స్వేఛ్చకు ఆటంకం లేకుండా ఉండాలంటే పెళ్లియిన వారైతేనే మంచిదనే అభిప్రాయం తారల్లో ఉన్నట్టుంది.
అలా పెళ్లియన వారిని చేసుకుని విడిపోయి మళ్లీ పెళ్లి చేసుకుని సుఖంగా ఉంటున్న తారలు కూడా ఉన్నారు. కొంతమంది అయితే ఆత్మహత్యకు యత్నించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ పేర్లు ఇప్పటికే చాలామందికి తెలిసినవే కాబట్టి వాటిని ప్రత్యేకంగా ప్రస్తావించనవసరం లేదు.

పెళ్లి కాకుండానే తల్లులు
పెళ్లి కాకుండా గర్భం దాలిస్తే సమాజం అదో రకంగా చూస్తుంది. కొంతమంది తారలు పెళ్లి కాకుండానే హీరోలతో సహజీవనం చేసి గర్భం దాల్చిన సందర్భాలు ఉన్నాయి. నటి శ్రీదేవి బోనీ కపూర్ ను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. బోనీ కపూర్ ను పెళ్లి చేసుకోడానికి ముందే ఆమె గర్భం దాల్చినట్టు అప్పట్లో వార్తలు వచ్చాయి.
నటి జయలలిత విషయంలోనూ అంతే. హీరో శోభన్ బాబుతో జయలలిత సహజీవనం చేసిన సంగతి చాలా మందికి తెలుసు. వారిద్దరికీ ఓ కూతురు పుట్టినట్టుగా కూడా చెబుతుంటారు. జయలలిత చనిపోయిన తర్వాత ఆమె కూతురు ప్రస్తావన చాలా సార్లు వచ్చింది. నిప్పులేకుండా పొగరాదంటారు. ఇప్పటికే ఆ కూతురు ఎక్కడ ఉందో ఎవరికీ తెలియదు.
పెటాకులుగా మారిన పెళ్లిళ్లు
తారల వివాహాలు పెటాకులుగా మారిన సందర్భాలే ఎక్కువ. దీనికి కారణం ఈగో ప్రాబ్లమ్. రేణుదేశాయ్, పవన్ కళ్యాణ్ ల విషయానికి వస్తే ఇదే కారణమని తెలుస్తోంది. పవన్ తో పెళ్లికి ముందే రేణు దేశాయ్ గర్భం దాల్చినట్టు వార్తలు వచ్చాయి. ఆ తర్వాతే వీరు పెళ్లి చేసుకున్నారు. కొంత కాలం కలిసి ఉండి విడిపోయారు. సూపర్ స్టార్ రజినీ కాంత్, మెగాస్టార్ చిరంజీవి విషయంలో మాత్రం ఇలాంటి వార్తలు రాలేదు. బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ విషయంలోనూ వార్తలు ఉన్నాయి.
అమితాబ్, రేఖల మధ్య ప్రేమాయణం గురించి అందరికీ తెలుసు. కాకపోతే ఆ బంధం మధ్యలోనే తెగిపోయింది. కృష్ణ, విజయనిర్మల బంధం గురించి తెలుగువారికి తెలియంది కాదు. కానీ వారు ఆదర్శ దంపతులుగా మిగిలిపోయారు. ధర్మేంద్ర, హేమమాలినిల బంధం కూడా అంతే. కమల్ హాసన్ బాలీవుడ్ నటి సారికను పెళ్లి చేసుకున్నారు. అప్పటికే కమల్ కు పెళ్లయింది. కానీ సారికతోనూ కమల్ కు తేడా వచ్చింది. ఇలా ఏ తార జీవితంలోకి తొంగి చూసినా ఓ ప్రేమ కథ తొంగి చూస్తుంది. ఈ ప్రేమ కథ సుఖాంతం అయితే ఎవరికీ ఎలాంటి సమస్యా ఉండదు.
Must Read ;- అనిరుథ్ ప్రేమలో పడ్డ.. అందాల భామలు











