September 5, 2026 5:44 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Editors Pick

జగన్ ప్రభుత్వం ఈ సవాలుకు సిద్ధమేనా?

పాలయుద్ధం మొదలైంది. అమూల్ సంస్థను ప్రభుత్వం ప్రోత్సహిస్తున్న తీరును సహకార డెయిరీలు వ్యతిరేకిస్తున్నాయి. అమూల్ కంటె ఎక్కువ ధర తామే ఇవ్వగలమని సవాళ్లు విసురుతున్నాయి.

December 6, 2020 at 2:55 PM
in Editors Pick, General, Latest News
ap amul dairy
Share on FacebookShare on TwitterShare on WhatsApp

హాట్ మిల్క్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాలయుద్ధం జరుగుతోంది. ఇప్పటికే ప్రభుత్వం అమూల్ డెయిరీని ప్రోత్సహిస్తూ.. ఆ డెయిరీకి పాలుపోస్తే.. పాడిరైతులకు ఎక్కువ ధర గిట్టుబాటు అవుతుందని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ మేరకు రైతులంతా అమూల్‌కు పాలుపోసేలా ప్రోత్సహిస్తున్నారు. తాము పాడిరైతుల సంక్షేమం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. అయితే ఇప్పటికే.. ఈ ‘ఎక్కువ ధర’ అనేది మిథ్య అనే వాదనలు మొదలయ్యాయి. తాజాగా గుంటూరు జిల్లాలోని సంగం డెయిరీ ఛైర్మన్, తెలుగుదేశం పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ నరేంద్ర మరోసారి మీడియా ముందుకు వచ్చి సంచలన సవాళ్లు విసురుతున్నారు. అమూల్ డెయిరీ మీద జగన్ సర్కారు ఎందుకంత ప్రేమ చూపిస్తోందని ఆయన ప్రశ్నిస్తున్నారు. అదొక్కటే కాదు… మౌలిక వసతుల పరంగా వారికి కల్పించే సదుపాయాలు తమకు కల్పిస్తే గనుక.. తాము లీటరుకు 30 రూపాయలు అదనంగా రైతులకు ఇస్తాం అని కూడా నరేంద్ర సవాలు విసిరారు. ప్రభుత్వం చెబుతున్న ప్రకారం.. అమూల్ కు పాలుపోయడం వల్ల రైతుకు అదనంగా వచ్చేది 7 రూపాయలు మాత్రమే. అది కూడా అబద్ధమే అనేది ఒక వాదన. కాగా, ఇప్పుడు ధూళినాళ నరేంద్ర చెబుతున్న ప్రకారం.. లీటరుకు 30 రూపాయలు ఎక్కువగా రావడం అంటే.. అది పాడి రైతుకు మామూలు లాభం కాదు. మరి ఈ సవాలును ప్రభుత్వం స్వీకరిస్తుందా? పతాక స్థాయికి చేరుతున్న ధరల యుద్ధంలో తమ నిర్ణయం సరైనదేనని ఢంకాబజాయించి నిరూపించుకోగలుగుతుందా?

తాజాగా, సంగం డెయిరీ ఛైర్మన్ ధూళిపాళ్ల నరేంద్ర- డెయిరీ డైరెక్టర్లతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఏపీ ప్రభుత్వం అమూల్ కోసం ఎక్కువగా తహతహలాడుతోందని, సుమారు రూ. 3 వేల కోట్లను మౌలిక సదుపాయాల నిమిత్తం ఖర్చు పెట్టడం దేనికని ఆయన ప్రశ్నించారు. అమూల్ సంస్ఖకు ఆస్తులను ధారాదత్తం చేయాలని ఎందుకు భావిస్తున్నారో అర్ధం కావడం లేదన్నారు. ఏపీలో విజయ బ్రాండ్‌కు బ్రాండ్ అంబాసిడరుగా ఉండాల్సిన సీఎం.. అమూల్‌కు బ్రాండ్ అంబాసిడరుగా ఎందుకు మారారో అర్ధం కావడం లేదని నరేంద్ర ఎద్దేవా చేశారు.

ఏపీలోని వ్యవస్థల కోసం కాకుండా ముఖ్యమంత్రి, గుజరాత్‌లోని వ్యవస్థల కోసం పని చేయడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోందన్నారు. సంగం డెయిరీ విషయంలో కక్ష కట్టినట్టు వ్యవహరిస్తే.. రాజకీయం అనుకోవచ్చునని, కానీ ఎన్నికల ముందు ఒంగోలు డెయిరీ కునారిల్లుతోందని మొసలి కన్నీరు కార్చిన జగన్.. ఆ డెయిరీని కూడా ఎందుకు టార్గెట్ చేస్తున్నారని ప్రశ్నించారు. ఒంగోలు డెయిరీ సేకరించే పాలను అమూల్‌కు మళ్లిస్తున్నారని, ఒంగోలు డెయిరీకి ఏడాదిన్నర కాలంలో రూ. 3లు కూడా ఇవ్వలేదని, ఒంగోలు డెయిరీని కాపాడుకోవాలని అన్నారు. ఒంగోలు డెయిరీ నిర్వీర్యం అవుతోంటే మంత్రి బాలినేని ఏం చేస్తున్నారని నరేంద్ర ప్రశ్నించారు.

సబర్ కాంతా యూనియన్ గుజరాత్ రాష్ట్రంలో పాల సేకరణకు రూ. 730 ఇస్తోంది.. కానీ ఏపీలో రూ. 650 ఇవ్వడం ఎలా సబబు అని నరేంద్ర సందేహం లేవనెత్తారు. రూపాయి ఖర్చు కూడా చేయని అమూల్ సేవలో అధికారులందరూ తరిస్తున్నారని అడిగారు.

వివిధ రాష్ట్రాల్లో అమూల్ సంస్థ పాలను సేకరిస్తోన్నా అక్కడి  ప్రభుత్వాలు ఖర్చు పెట్టడం లేదని, కానీ ఏపీ ప్రభుత్వం ఖర్చంతా తామే  పెడుతోందని అన్నారు. ఒకవైపు అప్పులు చేస్తూ, రాష్ట్ర సంపదను అమూల్ సంస్థకి ధారాదత్తం చేయడం దేనికని ప్రశ్నించారు. మన పాలకులకు స్వాభిమానం లేదని, ఏపీలోని సహకార వ్యవస్థలను నిర్వీర్యం చేసి అమూల్ కోసం పాటుపడుతున్నారని, ఆంధ్రప్రదేశ్ పేరును అమూల్ ప్రదేశ్  గా మార్చేశారని ఎద్దేవా చేశారు. సంగం డెయిరీలో గత 25 ఏళ్లల్లో రూ. 225 కోట్లు రైతులకు బోనస్‌గా ఇచ్చామన్నారు.‍

ఈ ప్రభుత్వానికి ప్రతిదీ దందానే అని ఆరోపించిన నరేంద్ర, సంగం, విజయ డెయిరీలంటే నచ్చక పోవచ్చుగానీ,  వైసీపీ నేతల చేతుల్లో ఉన్న విశాఖ డెయిరీని కూడా నిర్వీర్యం చేస్తున్నారని వాపోయారు. గతంలో విశాఖ డెయిరీ ఐదు జిల్లాల్లో పాల సేకరణ చేసేవారని.. కానీ ఇప్పుడు విశాఖ డెయిరీ మూడు జిల్లాలకే పరిమితం అయిందని పేర్కొన్నారు.

టార్గెట్ చేయడంలో ఈ ప్రభుత్వాన్ని మించిన వాళ్లు లేరని, కలిసొచ్చే డెయిరీలతో కలిసి పోరాడతామని అన్నారు. ప్రభుత్వాలు పరిపాలన చేయాలే కానీ.. పాల వ్యాపారం చేయడం సరికాదన్నారు. ప్రభుత్వంతో సంబంధం లేకుండా అమూల్ సొంతంగా రమ్మనండి చూద్దాం.. ఎంత వరకు రైతులకు మేలు చేయగలరో చూద్దామని సవాలు విసిరారు. ఏపీ ప్రభుత్వం వాళ్లకు పాలు పోయండి.. వీళ్లకు పోయొద్దు అని చెప్పడం కరెక్ట్ కాదన్నారు.

చేయూత స్కీమ్ ద్వారా డబ్బులిస్తూ.. అమూల్ సంస్థకే పాలు పోయాలని ఒత్తిడి తెస్తున్నారన్న నరేంద్ర, అమూల్ సంస్థకిచ్చే సహకారం తమకు అందచేస్తే.. అమూల్ కంటే రూ. 30 అధికంగా ఇస్తామని సవాలు విసిరారు. ప్రభుత్వం తీసుకునే చర్యలతో వేలాది కుటుంబాలు దెబ్బ తినే ప్రమాదం ఉందన్నారు.

అమూల్ తో పోటీ పెరగడంతో రాష్ట్రంలో అతిపెద్ద డెయిరీల్లో ఒకటైన సంగం డెయిరీ ఛైర్మన్ ఇలాంటి ఆగ్రహాన్ని వ్యక్తం చేయడం సహజమే అనిపించవచ్చు. కానీ.. అమూల్‌కు ప్రభుత్వం కల్పిస్తున్న ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సదుపాయాలు తమకు కల్పిస్తే.. రూ.30 ఎక్కువ లీటరుకు ఇవ్వగలమని చెప్పడం మాత్రం విస్మరించదగినది కాదు. మరి ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.

Also Read: PRAKASAM DIST ; TDP

Tags: amul dairyAndhra Pradesh Newsandhra pradesh news todayap politicsChandrababu Naidudhulipalla narendrajaganmohan reddysangam dairytelugu news
Previous Post

దుల్కర్ సల్మాన్ సరసన అందాల రాశి.. నిజమేనా?

Next Post

బీ కేర్ ఫుల్.. అత్యుత్సాహం వద్దు… ప్రభుత్వాలు శాశ్వతం కాదు!

Related Posts

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

by లియో డెస్క్
September 4, 2026 7:54 pm

ఏపీ, తమిళనాడు మధ్య ఇండస్ట్రియల్ వార్ పీక్స్‌కు చేరింది. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద...

డాక్టర్ రవిప్రకాశ్‌ కిడ్నాప్ వివాదం.. పుట్టా ఫ్యామిలీపై వైసీపీ డ్రామా..!

by లియో డెస్క్
September 4, 2026 6:36 pm

మైదుకూరు MLA పుట్టా సుధాకర్ యాదవ్‌ టార్గెట్‌గా వైసీపీ నేతలు చేసిన కుట్ర...

వెలిగొండ, పోలవరం ఎడమకాలువ.. కూటమి సర్కార్‌ సరికొత్త రికార్డు..!

by లియో డెస్క్
September 3, 2026 7:38 pm

దశాబ్దాల కాలంగా పెడింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసి కరవు ప్రాంతాల సాగు,...

ఏపీలో 100 శాతం అక్షరాస్యత.. సెప్టెంబర్ 2027 టార్గెట్..!

by లియో డెస్క్
September 3, 2026 6:53 pm

ఏపీ ప్రభుత్వం వరుస విజయాలతో దూకుడు మీద ఉంది. ప్రతీ రంగంలో తనదైన...

కాకినాడకి హ్యుందాయ్ పరిశ్రమ.. ఏపీ,లోకేష్‌పై తమిళ యువత అసూయ..!

by లియో డెస్క్
September 3, 2026 6:12 pm

సౌత్‌ ఇండియాలో పెట్టుబడుల కోసం రాష్ట్రాల మధ్య పోటీ తీవ్ర స్థాయికి చేరుకుంది....

వెలిగొండపై బీఆర్‌ఎస్‌ రాజకీయం.. జగన్‌ సైలెంట్‌..? రెచ్చగొట్టిన వైసీపీ..

by లియో డెస్క్
September 2, 2026 8:14 pm

ఏపీలో నీళ్లు పారితే తెలంగాణలో రాజకీయం రగులుకుంది. సీఎం చంద్రబాబు వెలిగొండ ప్రాజెక్టు...

వలసలకు గుడ్‌బై.. గోదావరి జలాలతో ఉత్తరాంధ్ర సస్యశ్యామలం. .!

by లియో డెస్క్
September 2, 2026 7:28 pm

వెనుకబాటుతనం, తాగు-సాగునీటి ఎద్దడి, వలసలతో కొట్టుమిట్టాడుతున్న ఉత్తరాంధ్రను గోదావరి జలాలు తాకాయి. పోలవరం...

మారికవలస స్కూల్‌పై ఫేక్ ప్రచారం.. వైసీపీ మళ్లీ ఫెయిల్..!

by లియో డెస్క్
September 2, 2026 7:05 pm

కూటమి ప్రభుత్వంపై మరోసారి ఫేక్ ప్రచారానికి దిగింది వైసీపీ. ఏదో ఒక ఫేక్...

వెలిగొండ కల సాకారం..జగన్‌ డ్రామాలపై మాగుంట ఫైర్‌..!

by లియో డెస్క్
September 1, 2026 7:14 pm

ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంతం భవిష్యత్తును మార్చేస్తూ పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు...

మారుతున్న రాయలసీమ రూపురేఖలు.. పవన్‌ నిర్ణయంతో వెలుగులు

by లియో డెస్క్
September 1, 2026 6:41 pm

రాయలసీమ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలతో వేగంగా అడుగులు వేస్తోంది. రానున్న...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

డాక్టర్ రవిప్రకాశ్‌ కిడ్నాప్ వివాదం.. పుట్టా ఫ్యామిలీపై వైసీపీ డ్రామా..!

కాకినాడకి హ్యుందాయ్ పరిశ్రమ.. ఏపీ,లోకేష్‌పై తమిళ యువత అసూయ..!

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

వెలిగొండ, పోలవరం ఎడమకాలువ.. కూటమి సర్కార్‌ సరికొత్త రికార్డు..!

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

Bollywood Actress Sonam Bajwa Sexy Pictures

Actress Naina Ganguly Looks Stunning

Lavanya Tripathi

తిరుమల నడకదారిలో.. భక్తులకు వైద్య సేవలు..!

ముఖ్య కథనాలు

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

డాక్టర్ రవిప్రకాశ్‌ కిడ్నాప్ వివాదం.. పుట్టా ఫ్యామిలీపై వైసీపీ డ్రామా..!

వెలిగొండ, పోలవరం ఎడమకాలువ.. కూటమి సర్కార్‌ సరికొత్త రికార్డు..!

ఏపీలో 100 శాతం అక్షరాస్యత.. సెప్టెంబర్ 2027 టార్గెట్..!

కాకినాడకి హ్యుందాయ్ పరిశ్రమ.. ఏపీ,లోకేష్‌పై తమిళ యువత అసూయ..!

వెలిగొండపై బీఆర్‌ఎస్‌ రాజకీయం.. జగన్‌ సైలెంట్‌..? రెచ్చగొట్టిన వైసీపీ..

మారికవలస స్కూల్‌పై ఫేక్ ప్రచారం.. వైసీపీ మళ్లీ ఫెయిల్..!

వెలిగొండ కల సాకారం..జగన్‌ డ్రామాలపై మాగుంట ఫైర్‌..!

మారుతున్న రాయలసీమ రూపురేఖలు.. పవన్‌ నిర్ణయంతో వెలుగులు

జగన్‌కు బిగ్ షాక్..అప్రూవర్‌గా మారబోతున్న విజయసాయి..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

డాక్టర్ రవిప్రకాశ్‌ కిడ్నాప్ వివాదం.. పుట్టా ఫ్యామిలీపై వైసీపీ డ్రామా..!

వెలిగొండ, పోలవరం ఎడమకాలువ.. కూటమి సర్కార్‌ సరికొత్త రికార్డు..!

ఏపీలో 100 శాతం అక్షరాస్యత.. సెప్టెంబర్ 2027 టార్గెట్..!

కాకినాడకి హ్యుందాయ్ పరిశ్రమ.. ఏపీ,లోకేష్‌పై తమిళ యువత అసూయ..!

వెలిగొండపై బీఆర్‌ఎస్‌ రాజకీయం.. జగన్‌ సైలెంట్‌..? రెచ్చగొట్టిన వైసీపీ..

వలసలకు గుడ్‌బై.. గోదావరి జలాలతో ఉత్తరాంధ్ర సస్యశ్యామలం. .!

మారికవలస స్కూల్‌పై ఫేక్ ప్రచారం.. వైసీపీ మళ్లీ ఫెయిల్..!

వెలిగొండ కల సాకారం..జగన్‌ డ్రామాలపై మాగుంట ఫైర్‌..!

మారుతున్న రాయలసీమ రూపురేఖలు.. పవన్‌ నిర్ణయంతో వెలుగులు

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

డాక్టర్ రవిప్రకాశ్‌ కిడ్నాప్ వివాదం.. పుట్టా ఫ్యామిలీపై వైసీపీ డ్రామా..!

వెలిగొండ, పోలవరం ఎడమకాలువ.. కూటమి సర్కార్‌ సరికొత్త రికార్డు..!

ఏపీలో 100 శాతం అక్షరాస్యత.. సెప్టెంబర్ 2027 టార్గెట్..!

కాకినాడకి హ్యుందాయ్ పరిశ్రమ.. ఏపీ,లోకేష్‌పై తమిళ యువత అసూయ..!

వెలిగొండపై బీఆర్‌ఎస్‌ రాజకీయం.. జగన్‌ సైలెంట్‌..? రెచ్చగొట్టిన వైసీపీ..

వలసలకు గుడ్‌బై.. గోదావరి జలాలతో ఉత్తరాంధ్ర సస్యశ్యామలం. .!

మారికవలస స్కూల్‌పై ఫేక్ ప్రచారం.. వైసీపీ మళ్లీ ఫెయిల్..!

వెలిగొండ కల సాకారం..జగన్‌ డ్రామాలపై మాగుంట ఫైర్‌..!

మారుతున్న రాయలసీమ రూపురేఖలు.. పవన్‌ నిర్ణయంతో వెలుగులు

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist