హాలీవుడ్ లో బెట్, లెట్స్ స్టే టుగెదర్ లాంటి సినిమాలతో బెస్ట్ పెర్ఫార్మర్ అనిపించుకొన్న యువనటుడు బెర్ట్ బెలాస్కో (38) మృతిచెందారు. హెన్రికో నగరం పోలీసులు ఈ విషయాన్ని ధ్రువీకరించారు. బెలాస్కో ఒక సినిమా షూటింగ్ నిమిత్తం వర్జీనియాకు రాగా.. సెట్లోకి అడుగుపెట్టే ముందు ఆయన్ని క్వారంటైన్ లో ఉంచారు. కొద్దిరోజులుగా బెలాస్కో హోటల్ గదిలోనే ఉంటున్నారు. అయితే రెండు రోజుల క్రితం బెలాస్కో స్నేహితురాలు, అతడి తండ్రి కాంటాక్ట్ చేయగా.. అతడి నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాలేదట. దాంతో హోటల్ సిబ్బందికి సమాచారం అందించగా బెలాస్కో చనిపోయి ఉన్నాడట.
బెలాస్కో మరణానికి కారణం ఎన్యూరిజం అయి ఉంటుందని అతడి తండ్రి చెప్పాడు. రక్తనాళాలు ఉబ్బితే వచ్చే అరుదైన వ్యాధి ఎన్యూరిజం. బెలాస్కో మృతికి హాలీవుడ్ ప్రముఖులు తమ సంతాపం వ్యక్తం చేశారు. బెట్ సినిమా యూనిట్ సభ్యులు బెలాస్కో మరణంతో బెట్ కుటుంబంలోని ఒక సభ్యుడ్ని కోల్పోయామని అతడి ఆత్మ శాంతికి అందరూ ప్రార్ధించమని చెప్పారు.