కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ ‘వలిమై’ సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతోంది. దర్శకుడు వినోద్, అజిత్ ఇతర నటీనటులపై కీలక సన్నివేశాలను తీస్తున్నారు. మొన్నీమధ్యనే షూటింగ్ సమయంలో అజిత్ కు గాయాలు అయిన సంగతి తెలిసిందే. బైక్ స్టంట్స్ చేస్తుండగా జరిగిన ప్రమాదంలో అజిత్ చేతికి, వేళ్ళకు గాయాలయ్యాయి. దీంతో వెంటనే అజిత్ హాస్పిటల్ కు వెళ్లి తన గాయాలకు చికిత్స చేయించుకున్నారు. ట్రీట్మెంట్ చేసిన డాక్టర్లు కొన్ని రోజులు రెస్ట్ తీసుకోవాలని అజిత్ కు సూచించారు. ఈ సంఘటనతో షూటింగ్ వాయిదా పడుతుందని అందరూ భావించారు.
అయితే డాక్టర్ల సలహాలను పక్కను పెట్టి అజిత్ రెస్ట్ తీసుకోకుండానే షూటింగ్ లో జాయిన్ అయ్యారట. తనుకు తగిలిన గాయాలను లెక్కచేయకుండా ఎంతో ఉత్సాహంతో షూటింగ్ లో పాల్గొంటున్నారు అజిత్. ప్రస్తుతం షూటింగ్ ఎటువంటి గ్యాప్ లేకుండా జరుగుతోంది. నిర్మాతల బాగు కోసం అజిత్ ఈ నిర్ణయం తీసుకున్నారని చిత్ర బృందం తెలిపింది. నిర్మాతలపై అజిత్ కు ఉన్న శ్రద్ధను చూసి అభినందనలు కురిపిస్తున్నారు మిగిలిన నిర్మాతలు. అజిత్ లాగానే మిగిలిన హీరోలు కూడా నిర్మాతలు కోసం ఆలోచిస్తే సినీ పరిశ్రమ బాగుంటుందని అంటున్నారు.
ఇక సినిమా విషయానికి వస్తే హైదరాబాద్ లో జరుగుతున్న షూటింగ్ తో 70శాతం సినిమా పూర్తవుతుందని తెలుస్తోంది. అజిత్ సాహసంతో చేస్తున్న యాక్షన్ సన్నివేశాలు సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయట. ఈ సినిమాలో తెలుగు యువ హీరో కార్తికేయ విలన్ గా నటిస్తుండగా హీరోయిన్ గా బాలీవుడ్ నటి హ్యూమా ఖురేషి నటిస్తోంది. ‘వలిమై’ సినిమాపై అజిత్ అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. అందుకు కారణం అజిత్ – దర్శకుడు హెచ్. వినోద్ కాంబినేషన్ లో వచ్చిన గత చిత్రం ‘నెర్కొండ పారవై’ సూపర్ హిట్ అవ్వడమే. ‘నెర్కొండ పారవై’ సినిమా లాగానే ‘వలిమై’ చిత్రం కూడా పక్కాగా హిట్ అవుతుందని అభిమానులు భావిస్తున్నారు. అలాగే అజిత్ గాయాలను లెక్కచేయకుండా షూటింగ్ లో జాయిన్ అవ్వడం పట్ల వారు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. తమ హీరోకు సినిమాలపై ఉన్న కమిట్మెంట్ గురించి గర్వంగా చెప్పుకుంటున్నారు.
Must Read ;- బాలీవుడ్ హ్యాండ్సమ్.. హాలీవుడ్ మూవీ