జీహెచ్ ఎంసీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ కేవలం రెండంటే రెండే సీట్లకు పరిమితమైన సంగతి తెలిసిందే. దాదాపు కాంగ్రెస్ దుకాణం సర్దేసింది అని కామెంట్లు కూడా మొదలయ్యాయి. ఫలితాలు చూసిన కాంగ్రెస్ నేతలు, కార్యకర్తల్లో ధైర్యం సన్నగిల్లింది, పార్టీ భవిషత్తు గురించి భయం మొదలైంది. కానీ, రేవంత్ రెడ్డి మాత్రం అంతర్మధనం చేసుకోవాల్సిన సమయమిది అని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
కేసీఆర్ బద్నాం చేశాడు
ఎన్నికల ప్రచారంలో ప్రణాళికాబద్దకంగా పార్టీ చేసింది, కానీ కేసీఆర్ మనల్ని బద్నాం చేశాడని చెప్పుకొచ్చాడు. కాంగ్రెస్ ని గెలిపిస్తే ఉపయోగం లేదు, తర్వాత మేమే అభివృద్ధి చేయాలి అంటూ ప్రజల్లోకి బాగా తీసుకెళ్లాడు. మనం దాదాపు 50 మీటింగ్స్ నిర్వహించాం. అన్నీ విజమయవంతంగా నిర్వహించాం. కానీ ఫలితాలు అనుకూలంగా రానంత మాత్రానా మనం కష్టపడలేదని కాదు. కార్యకర్తలందరూ తమ వంతు కృషి చేశారు. కానీ, కొన్ని కష్ట సమయాలు రావడం అనేది మామూలు విషయమే. అలాంటి సమయంలోనే ధైర్యంగా ఉండాలి.
కలిసి సాధించుకుందాం
ఇప్పుడు కష్టకాలం వచ్చిందని ఎవరి దారి వారు చూసుకోవడం కరెక్ట్ కాదు. అందరం కలిసి కట్టుగా పనిచేస్తే మంత్రులు, ఎమ్మెల్యేలు మన మాట వినేలా చేసుకోవచ్చు. అందుకు ప్రణాళిక అవసరం, కలిసి పనిచేయడం వల్ల మాత్రమే మనం సాధించగలం. ఈ ఎన్నికల వల్ల 5 నియోజక వర్గాల్లో ఎవరెవరు పార్టీ కోసం కష్టపడుతున్నారనే దానిపైన అందరికీ అవగాహాన వచ్చింది. అవకాశం రాక ఎదురుచూస్తున్న వారు ఎందరో ఉన్నారు. మీకు అవకాశం వచ్చింది కాబట్టి కష్టపడి పనిచేస్తే గుర్తింపు లభిస్తుంది. ప్రస్తుతం నిరాశ పొందిన మాట నిజమే, కానీ భవిష్యత్తులో మీరు విజయాన్ని పొందుతారు.
Must Read ;- ‘2 నిమిషాల కోసం రేండేళ్లుగా ఎదురు చూసాను’
మీకు నేనున్నాను
మీకు అండగా పార్టీ ఉంది, మిమ్మల్ని నడిపంచడానికి నేనున్నాను. మీరు ఎవరి గురించి ఆలోచించకండి. ఎన్ని సమస్యలు వచ్చినా క్షేత్రం మాత్రం వదలకండి. కేవలం మాటలు కాదు, ఏ సమస్య వచ్చినా తాను నిలబడతానని చెప్పుకొచ్చారు రేవంత్ రెడ్డి. 5 సంవత్సరాలు ప్రజలకు సేవ చేయాలని కార్పొరేటర్ గా పోటీ చేశాం. గెలవడం, ఓడిపోవడం అనేది అభ్యర్థి సమస్య, ప్రజలను, పార్టీని నిందించాల్సన అవసరం లేదు. ఓడినా సరే ప్రజలకు అందుబాటులో ఉంటూ వారికి సేవ చేయడం అభ్యర్థుల బాధ్యత. అప్పుడే మీరు ప్రజలకు దగ్గర కాగలరు, భవిషత్తులో విజయాన్ని అందుకోగలరు.
స్పెషల్ ఆఫీసర్ పరిపాలన రావచ్చు
ఇప్పుడు గెలిచినా వారు కూడా మేయర్ ని ఎన్నుకునే పరిస్థితి లేదు. టీఆర్ ఎస్ మాటలు చూస్తుంటే స్పెషల్ ఆఫీసర్లతో 1-2 ఏళ్లు పరిపాలన సాగించేట్లు కనిపిస్తుంది. ఎప్పుడైనా పరిణామాలు మారిపోవచ్చు. ప్రజలకు సేవ చేయడానికి ఓటమి అడ్డంకి కాదని కాంగ్రెస్ అభ్యర్థలు నిరూపించి చూపించాలి. ప్రజా సమస్య అంటే వేరే ఆలోచన అనేది లేకుండా ప్రశ్నించండి, అందరినీ నిలదీయండి, వారి తరపున పోరాడడంలో ముందుండండి. అవే మిమ్మల్ని విజయతీరాలకి చేరుస్తాయి. ఇలా కార్యకర్తలలో ధైర్యాన్ని నింపేలా ప్రసంగించారు రేవంత్ రెడ్డి.
Also Read ;- కమలదళంలోకి కాంగ్రెస్ నేతలు ఎవరెవరు?