ఈ మధ్య కాలంలో తెలుగు తెరకి పరిచయమైన అందమైన కథానాయికలలో పాయల్ రాజ్ పుత్ ఒకరుగా కనిపిస్తుంది. పంజాబి సినిమాతో తన కెరియర్ ను ఆరంభించిన ఈ అమ్మాయి, ‘RX 100’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ కి ఈ అమ్మాయి ప్రధానమైన ఆకర్షణగా నిలిచింది. ముఖ్యంగా ఆమె మంచి పొడగరి కావడం .. అందుకు తగిన పర్సనాలిటీ .. ఆకర్షణీయమైన కళ్లు కలిగి ఉండటంతో యూత్ ను ఎంతగానో ఆకట్టుకుంది. అనుష్క తరువాత మరో పొడగరి కథానాయిక ఇండస్ట్రీకి వచ్చిందని అంతా చెప్పుకున్నారు.
పాయల్ గ్లామర్ కి ఫిదా అయిన కుర్రాళ్లు ఇక తెలుగులో ఆమెకి వరుస అవకాశాలు వస్తాయని ఆశించారు. స్టార్ హీరోయిన్ గా దూసుకెళ్లడం ఖాయమని భావించారు. ఈ నేపథ్యంలోనే పాయల్ ‘వెంకీమామ’ .. ‘డిస్కోరాజా‘ సినిమాలు చేసింది. ఈ రెండు సినిమాల్లోను గ్లామర్ పరంగా కుర్రకారును ఆమె హుషారెత్తించింది .. కానీ అవి ఆమె కెరియర్ కి పెద్దగా హెల్ప్ కాలేకపోయాయి. మంచి అవకాశాలను అందిపుచ్చుకోవాలనే ఉత్సాహంతో ఆమె ప్రయత్నాలను ప్రారంభిస్తున్న తరుణంలోనే ‘కరోనా’ కాలు పెట్టింది .. దాంతో పాయల్ ఆశలు ఆవిరయ్యాయి.
Must Read ;-అనురాగ్ పై నార్కో అనాలిసిస్ జరపాలంటోన్న పాయల్ ఘోష్
లాక్ డౌన్ కి ముందు పాయల్ ‘అనగనగా ఓ అతిథి‘ సినిమా చేసింది. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ సినిమాకి దయాళ్ పద్మనాభన్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా నుంచి వెలువడిన టీజర్ .. ట్రైలర్ యూత్ లో ఆసక్తిని పెంచుతున్నాయి. పాయల్ రొమాన్స్ తో కూడిన ఎమోషనల్ పాత్రను చేసింది. పల్లెటూరి యువతి పాత్రలో పాయల్ చాలా సింపుల్ గా .. మరింత ఆకర్షణీయంగా కనిపిస్తోంది. ఆమె లుక్ .. బాడీ లాంగ్వేజ్ .. యాసతో కూడిన డైలాగ్ డెలివరీ ఆకట్టుకుంటున్నాయి. ఈ నెల 20వ తేదీన ఈ సినిమా తెలుగు ఓటీటీ ‘ఆహా’ ద్వారా పలకరించనుంది. ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని రాబడుతుందో చూడాలి.
పాయల్ మంచి అందగత్తె అనేది అభిమానులంతా చెప్పుకునే మాట. స్టార్ హీరోయిన్ గా ఎదగడానికి అవసరమైన లక్షణాలు ఆమెలో పుష్కలంగా వున్నాయి. అయితే కథల ఎంపిక విషయంలోను .. కాంబినేషన్ విషయంలోను ఆమె పెద్దగా దృష్టి పెట్టడం లేదనే టాక్ వినిపిస్తోంది. క్రేజీ ప్రాజెక్టులను దక్కించుకునే ప్రయత్నాలు చేయకపోతే, పాయల్ కెరియర్ ప్రమాదంలో పడే అవకాశాలు ఉన్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అందువలన వెంటనే ఆమె మేలుకోవలసిన అవసరం వుంది.
మహేశ్ బాబు .. ప్రభాస్ వంటి పొడగరి హీరోల సరసన పాయల్ ను చూడాలని ఆమె అభిమానులు ఆశ పడుతున్నారు. ఆ దిశగా అడుగులు వేయాలంటే, ఆమె ప్రతి విషయంలోను ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టవలసి ఉంటుంది. కెరియర్ ను సీరియస్ గా తీసుకుని,తనని పైమెట్టుకు చేర్చే సినిమాలు చేయవలసి ఉంటుంది. అప్పుడే ఆమె అభిమానులు ఆశించిన స్థాయిని అందుకోగలుగుతుంది. ఇక ‘ఏంజిల్’ అనే హారర్ మూవీతో ఆమె తమిళ చిత్రపరిశ్రమకి కూడా పరిచయమవుతోంది. ఉదయనిధి స్టాలిన్ సరసన ఆమె చేస్తున్న ఈ సినిమా, అక్కడ ఆమెకి ఎంతవరకూ హెల్ప్ అవుతుందో చూడాలి.
AlsoRead ;- శకుంతలగా అనుష్క?