ఒకప్పుడు తెలుగు సినిమాల్లో క్రూరమైన రౌడీ గా పేరు తెచ్చుకున్నాడు తమిళ నటుడు పొన్నంబళం. తమిళ, తెలుగు, మలయాళ చిత్రాల్లో స్టార్ హీరోలతో తలపడేందుకు పొన్నంబళం ఏదో ఒక సీన్ లో ఎంటరయ్యేవాడు. భారీ పెర్సనాలిటీ.. కండలు తిరిగిన శరీరం.. భయంకరమైన ముఖ కవళికలు.. అప్పట్లో అతడ్ని స్టార్ రౌడీగా నిలబెట్టాయి. కానీ ఇప్పుడతడి పరిస్థితి చాలా దయనీయంగా ఉంది.
ఐదు ఏళ్ళ నుంచి పొన్నంబళం అనారోగ్యంతో బాధపడుతున్నాడు. కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ చేస్తే అతడి ప్రాణం దక్కే పరిస్థితి. అందుకే తనని ఆర్ధికంగా ఆదుకొని .. తన ప్రాణాలు నిలబెట్టమంటూ.. తమిళ, తెలుగు సినీ ప్రముఖుల్ని వేడుకుంటున్నాడు పొన్నంబళం. తనకి కిడ్నీ దానం చేయడానికి .. తన సోదరి కుమారుడు రెడీ గా ఉన్నాడని.. అయితే ఆపేరేషన్ కు భారీ గా ఖర్చవుతుందని .. తనకు ఆర్దిక సహాయం చేస్తే .. తన ప్రాణాల్ని నిలుపుకుంటాని అంటున్నాడు.
ఇప్పటికే కోలీవుడ్ లో పొన్నంబళానికి చాలా మంది నటీనటులు ఆర్ధిక సహాయం చేశారు. ఇప్పుడు తన ఆపరేషన్ కోసం సౌత్ స్టార్స్ అసోసియేషన్స్ తో పాటు మా నుంచి కూడా సహాయం కోరుకుంటున్నాడు .
Must Read ;- ఐ.సీ.యూ లో ‘లాభం’ తమిళ సినిమా దర్శకుడు