మక్కళ్ సెల్వన్ విజయ్ సేతుపతి, శ్రుతి హాసన్ జంటగా నటిస్తోన్న తమిళ మూవీ ‘లాభం’. వ్యవసాయ రంగంలోని దళారుల దందా నేపథ్యంలో సందేశాత్మకమైన కథ తో ఈ సినిమా తెరకెక్కింది. ఇటీవల విడుదలైన ‘లాభం’ ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. అయితే త్వరలోనే విడుదల కానున్న ఈ సినిమా దర్శకుడు మాత్రం ఇప్పుడు ఐసీయూ లో ఉన్నాడు. ఆయన పేరు జననాథన్.
కోలీవుడ్ లో జననాథన్ ఎప్పటి నుంచో దర్శకత్వ రంగంలో ఉన్నా.. తన కెరీర్ లో ఆయన తీసిన సినిమాలు మూడు , నాలుగు మాత్రమే. ఒక సినిమాకి జాతీయ అవార్డు కూడా అందుకున్నారు ఆయన. ఆరుపదుల వయసులో ఉన్న ఆయన ఇప్పుడు కూడా చెలాకీగా ‘లాభం’ సినిమాని దర్శకత్వం వహించాడు. ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ను రేయింబవళ్ళు నిద్ర మానుకొని మరీ కంప్లీట్ చేస్తున్నాడు.
అయితే రెండు రోజుల క్రితం జననాథన్ ఎడిటింగ్ వర్క్ కంప్లీట్ చేసి ఇంటికి భోజనానికి వెళ్ళి తిరిగి రాలేదట. అసిస్టెంట్స్ ఆయన గదికి వెళ్ళి చూడగా.. స్పృహ లేకుండా పడి ఉన్నాడు. వెంటనే ఆయన్ను హాస్పిటల్ కు తరలించగా . మెదడులో రక్తం గడ్డ కట్టినట్టు డాక్టర్లు చెప్పారు. ప్రస్తుతం ఐసీయులో ఆయనకి చికిత్స అందిస్తున్నారు. పరిస్థితి విషమంగా ఉంది. దీంతో తమిళ సినీ పరిశ్రమ ఆందోళన వ్యక్తం చేస్తోంది.
Must Read ;- అదంతా పుకారేనంటున్న విజయ్ సేతుపతి