ఈ రోజు సూర్య షష్ఠి. భాద్రపద మాసంలో శుక్ల పక్షంలో వచ్చే షష్ఠి తిథిని సూర్య షష్ఠి అంటారు. ఈ రోజు సూర్యుడిని ఆరాధించేవారికి చాల మంచి జరుగుతుందన్నది శాస్ర్త వచనం. ఎలాంటి పూజ చేయాలో చూద్దాం. ప్రత్యేకించి పూజలు పునస్కారాలు చేయనవసరం లేదు. తలస్నానం చేసి సూర్యనమస్కారం చేసినా చాలు. ఇంకా కావాలంటే ఆదిత్యపారాయణం చేస్తే మంచిది. ఈ తిథికి ఉన్న ప్రత్యేకత చూద్దాం.
షష్ఠి, సప్తమి కలిసిన షష్ఠి అంటే సూర్యుడికి ఇష్టమట. అది ఈ రోజే కావడం విశేషం. మరో విశేషమేమిటంటే ఈరోజు సుబ్రహ్మణ్యస్వామిని పూజిస్తే ఎలాంటి పాపాలైనా నశిస్తాయట. ఆవుపాలు, పెరుగు, నెయ్యి, గోమయం, గోమూత్రంతో సూర్యుడికి నివేదన చేస్తే అశ్వమేధయాగం చేసిన ఫలం దక్కుతుందని మన పెద్దలు అంటుంటారు. అందువల్ల ఎవరైనా ఈరోజు సూర్య ఆరాధన చేయిండి. సంబంధిత మంత్రాలు కూడా కింద ఇస్తున్నాము. ఆదిత్యుడు ఆరోగ్యాన్ని ఇస్తాడనే విషయాన్ని ఎవరూ మరచిపోవద్దు.
సూర్య మంత్రాలు
ఓం హ్రాం ఓం మిత్రాయ నమ:
ఓం హ్రీం ఓం రవయే నమః
ఓం హృం ఓం సూర్యాయ నమః
ఓం హ్రైం ఓం భానవే నమః
ఓం హ్రౌం ఓం ఖగాయ నమః
ఓం హ్రాం ఓం పూష్ణే నమః
ఓం హ్రాం ఓం హిరణ్యగర్భాయ నమః
ఓం హ్రీం ఓం మరీచయే నమః
ఓం హృం ఓం ఆదిత్యాయ నమః
ఓం హ్రైం ఓం సవిత్రే నమః
ఓం హ్రౌం ఓం అర్కాయ నమః
ఓం హ్రాం ఓం భాస్కరాయ నమః