May 3, 2026 12:24 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

జ‌గ‌న్ పాల‌న‌లో ఆడ‌పిల్ల‌ల‌కు ర‌క్ష‌ణ లేదు

జ‌గ‌న్ పాల‌న‌లో ఏపీలో మ‌హిళ‌ల‌పై దాడులు పెరిగిపోతున్నాయి. గుంటూరులో బీటెక్ విద్యార్థిని ర‌మ్య హ‌త్య ఘ‌ట‌నను ప‌రిశీలిస్తే ఈ విష‌యం బోధ‌ప‌డుతోంద‌న్న వాద‌న‌లు వినిపిస్తున్నాయి.

August 16, 2021 at 11:31 AM
in Andhra Pradesh, Latest News
No Protection For Girls
Share on FacebookShare on TwitterShare on WhatsApp

There Is No Protection For Girls Under The Jagan Regime : 

ప‌ట్ట ప‌గ‌లు.. న‌ట్ట న‌డిరోడ్డు.. జ‌నంతో కిట‌కిట‌లాడే న‌గ‌రం.. జ‌నమంతా చూస్తున్నారు.. అయితేనేం.. ఓ ప్రేమోన్మాది బ‌రి తెగించాడు. అభం శుభం తెలియ‌ని ఓ యువ‌తిని.. అందులోనూ ఇంజినీర్ గా మ‌రో ఏడాదిలో కొత్త జీవితం ప్రారంభిద్దామ‌ని ఆశ‌ప‌డుతున్న యువ‌తిని చేయి ప‌ట్టుకుని మ‌రీ లాగాడు.. అత‌డిని ఆమె విదిలించి కొట్టింది. అయినా వెన‌క్కు త‌గ్గ‌ని అత‌డు ఆమెను ప‌దే ప‌దే చేయి ప‌ట్టి లాగాడు. అయినా ఆమె అత‌డి మాట విన‌లేదు. దీంతో అత‌డు శివాలెత్తిపోయాడు. ఆమెపై క‌త్తితో దాడి చేశాడు.. ఒక పోటు.. ఆ వెంట‌నే మ‌రో పోటు.. అలా పొడుస్తూనే ఉన్నాడు.. ఆ దుర్మార్గుడి బారి నుంచి త‌ప్పించుకునేందుకు ఆ యువ‌తి య‌త్నిస్తూనే ఉంది.. అయినా అత‌డు వ‌ద‌ల్లేదు. క‌డుపుతో పాటు మెడ‌పైనా ఇష్టారాజ్యంగా పొడిచేశాడు..ఇంకేముంది ఆ యువ‌తి అక్క‌డే రోడ్డుపైనే ప‌డిపోయింది.. ఆ త‌ర్వాత ఆమెను ఆసుప‌త్రికి త‌ర‌లించినా ప్రాణాలు నిల‌వ‌లేదు. ఇదీ ఆదివారం నాడు గుంటూరు ప‌ట్ట‌ణం కాకానిలో చోటుచేసుకున్న ఘ‌ట‌న‌.

జ‌నం చూస్తుండ‌గానే..

ఏదో జ‌న సంచారం లేని ప్రాంతంలో ఆ ప్రేమోన్మాది బాధితురాలిపై దాడి చేయ‌లేదు. జ‌న‌మంతా చూస్తుండ‌గానే.. న‌డిరోడ్డుపై ఆమెపై విరుచుకుప‌డ్డాడు. క‌త్తితో ఆమెపై దాడి చేస్తున్న స‌మ‌యంలో అక్క‌డికి కొంద‌రు ప‌రుగు ప‌రుగున వ‌చ్చినా.. అత‌డిని ఆపేందుకు మాత్రం ముందుకు రాలేదు. వెర‌సి జ‌నార‌ణ్యంలోనే ఓ ఉన్మాది దాడిలో ఏ పాపం తెలియ‌ని యువ‌తి బ‌లైపోయింది. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించి వీడియో ఫుటేజీ ఇప్పుడు ఏపీలో క‌ల‌క‌లం రేపుతోంది. ఈ ఫుటేజీని చూస్తుంటే.. అస‌లు ఏపీలో మ‌హిళ‌ల‌కు ర‌క్ష‌ణ ఉందా? అన్న అనుమానాలు క‌లుగుతున్నాయి. మ‌హిళా భ‌ద్ర‌త‌కు అధిక ప్రాధాన్య‌మిస్తున్నామంటూ ఓ వైపు జ‌గ‌న్ చెబుతున్నా.. ఆ భ‌ద్ర‌త‌ను ప‌ర్య‌వేక్షించే హోం మంత్రి సొంత జిల్లాలోనే ఈ దారుణం జ‌రిగిన తీరు నిజంగానే ఏపీలో మ‌హిళ‌లు.. ప్ర‌త్యేకించి యువ‌తులు, విద్యాభ్యాసం కొన‌సాగిస్తున్న బాలిక‌ల‌కు ర‌క్ష‌ణ లేద‌నే చెప్పాలి.

దిశ యాప్ ర‌క్షించ‌లేదుగా

గుంటూరులోని సెయింట్ మేరీస్ ఇంజినీరింగ్ క‌ళాశాల‌లో థ‌ర్డ్ ఇయ‌ర్ ఇంజినీరింగ్ చ‌దువుతున్న ర‌మ్య (19)పై గుంటూరు జిల్లాకే చెందిన శివ‌కృష్ణ అనే యువ‌కుడు విచ‌క్ష‌ణార‌హితంగా దాడి చేసి చంపేశాడు. ఆదివారం ఉద‌యం జ‌రిగిన ఈ ఘ‌ట‌న ఏపీలో పెను క‌ల‌క‌ల‌మే రేపుతోంది. ర‌మ్య‌, శివ‌కృష్ణల మ‌ధ్య ఏం జ‌రిగిందో తెలియ‌దు గానీ.. ఓ యువ‌తిని, అది కూడా ఇంజినీరింగ్ విద్యార్థినిని ఓ ప్రేమోన్మాది న‌డిరోడ్డుపై క‌త్తితో దాడి చేసిన చంపిన తీరుపై ఆగ్ర‌హావేశాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. తమ ప్ర‌భుత్వ హ‌యాంలో ఆడ‌పిల్ల‌ల భ‌ద్ర‌త‌కు అత్య‌ధిక ప్రాధాన్యం ఇస్తున్నామంటూ జ‌గ‌న్ చెబుతున్నారు. అంతేకాకుండా మ‌హిళల ర‌క్ష‌ణ కోస‌మంటూ దిశ చ‌ట్టాన్ని ప్ర‌తిపాదించారు. దిశ యాప్ ను ప్రారంభించారు. ఏకంగా దిశ పోలీస్ స్టేష‌న్ల‌ను కూడా ఏర్పాటు చేశారు. అయితే ఇవేవీ మ‌హిళల‌కు ర‌క్ష‌ణ క‌ల్పించ‌లేక‌పోతున్న వైనం మాత్రం చాలా స్ప‌ష్టంగానే క‌నిపిస్తోంది. మ‌హిళ‌ల భ‌ద్ర‌త‌కు అత్యధిక ప్రాధాన్య‌మిస్తున్న క్ర‌మంలోనే రాష్ట్ర హోం శాఖ మంత్రిగా ఓ మ‌హిళ‌ను నియ‌మించామ‌ని జ‌గ‌న్ గొప్ప‌లు చెబుతున్నారు. ఆ మ‌హిళా హోం మినిస్ట‌ర్ సొంత జిల్లాలోనే ఇలాంటి దారుణాలు జ‌రుగుతున్న తీరు మాత్రం క‌ల‌క‌ల‌మే రేపుతోంది. మొత్తంగా జ‌గ‌న్ జ‌మానాలో మ‌హిళ‌ల‌కు ర‌క్ష‌ణ లేకుండాపోయింద‌న్న వాద‌న‌లు మ‌రింత బ‌ల‌ప‌డిపోయాయి.

జ‌గ‌న్ చ‌లించిపోయార‌ట‌

ఇదిలా ఉంటే.. రాష్ట్ర హోంమంత్రి మేకతోటి సుచరిత గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో రమ్య మృతదేహాన్ని పరిశీలించారు. బీటెక్ విద్యార్థిని రమ్య హత్య ఘటన ఎంతో బాధాకరమని వ్యాఖ్యానించారు. రమ్య హత్య ఘటన గురించి సీఎం జగన్ వివరాలు తెలుసుకున్నారని, ఆయన చలించిపోయారని హోంమంత్రి వెల్లడించారు. యువతిని హత్య చేసే హక్కు ఎవరిచ్చారని ఆమె ఆగ్రహంతో ప్రశ్నించారు. ఇంతటి దారుణానికి పాల్పడిన వ్యక్తికి కచ్చితంగా కఠిన శిక్ష పడుతుందని స్పష్టం చేశారు. ఈ హత్యకు సంబంధించి పోలీసులు కొన్ని ఆధారాలు సేకరించారని, హంతకుడి కోసం గాలింపు జరుగుతోందని చెప్పారు. అదే స‌మ‌యంలో మీడియాతో మాట్లాడిన డీజీపీ గౌతం స‌వాంగ్.. నిందితుడిని అరెస్ట్ చేసిన‌ట్టుగా ప్ర‌క‌టించారు. బాధిత కుటుంబానికి రూ.10 ల‌క్ష‌ల ప‌రిహారాన్ని ప్ర‌కటిస్తున్న‌ట్లుగా కూడా సీఎంఓ నుంచి ప్ర‌క‌ట‌న వ‌చ్చింది. జ‌గ‌న్ చ‌లించినా.. సుచ‌రిత కంట త‌డిపెట్టినా.. నిందితుడిని అరెస్ట్ చేశామ‌ని డీజీపీ ప్ర‌క‌టించినా.. బాధిత కుటుంబానికి ప‌రిహారం ప్ర‌క‌టించినా.. చనిపోయిన ర‌మ్య బ‌తికి వ‌స్తుందా? అంటూ ఏపీ ప్ర‌జ‌లు తీవ్ర ఆగ్ర‌హావేశాల‌తో ఊగిపోతున్నారు. ఇవే ప్ర‌శ్న‌ల‌తో గుంటూరు జీజీహెచ్ కు వ‌చ్చిన హోం మంత్రి సుచ‌రిత‌ను జ‌నం అడ్డుకున్నారు.

Must Read ;- లోకేశ్ తొలి అరెస్ట్ ఏపీని షేక్ చేసింది!

ఈ మాట నిజ‌మే: చంద్ర‌బాబు

ఈ ఘ‌ట‌న‌పై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. సీఎం జగన్ పాలనలో ఆడపిల్లలకు రక్షణ లేదని విచారం వ్యక్తం చేశారు. గుంటూరులో దళిత విద్యార్థిని హత్య తీవ్రంగా కలచివేసిందని అన్నారు. సీఎం నివాసానికి దగ్గర్లో ఘటన జరిగిందంటే రాష్ట్రంలో శాంతిభద్రతలు ఏవిధంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చని వ్యాఖ్యానించారు. వైసీపీ పాలనలో ఇప్పటిదాకా 500కి పైగా మహిళలపై దాడులు, అత్యాచార ఘటనలు జరిగాయని చంద్రబాబు వెల్లడించారు. దళిత మహిళ హోంమంత్రిగా ఉన్నాగానీ రాష్ట్రంలో మహిళలకు రక్షణ కొరవడిందని విమర్శించారు. సీఎం సోదరి సునీతారెడ్డికి ప్రాణహాని ఉందంటే, సామాన్యులకు ఈ ప్రభుత్వం నుంచి ఇంకేమి భద్రత దొరుకుతుందని అన్నారు. రమ్య కుటుంబానికి టీడీపీ అన్ని విధాలా అండగా ఉంటుందని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఇదిలా ఉంటే ర‌మ్య మృత‌దేహానికి నివాళులు అర్పించ‌డంతో పాటుగా ఈ ఘ‌ట‌న‌పై మ‌రిన్ని వివ‌రాలు తెలుసుకునేందుకు, బాధిత కుటుంబానికి భ‌రోసా ఇచ్చేందుకు టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేశ్ కాసేప‌ట్లో గుంటూరు జీజీహెచ్ కు వెళ్లారు. అప్పటికే పోస్టుమార్టం పూర్తి అవడంతో రమ్య మృత‌దేహాన్ని ఆమె ఇంటికి తీసుకెళ్లడంతో అక్కడికే వెళ్లిన లోకేశ్.. రమ్యకు నివాళి అర్పించి ఆమె కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.

ప‌రిటాల స్పంద‌న చూశారా?

ఈ దారుణ ఘ‌ట‌న‌పై టీడీపీ నేత ప‌రిటాల శ్రీ‌రామ్ త‌నదైన శైలిలో స్పందించారు. ‘అర్ధ‌రాత్రి స్త్రీ ఒంటరిగా సంచరించిన నాడే నిజమైన స్వాతంత్య్రం వచ్చినట్లని మహాత్మా గాంధీ గారు ఎప్పుడో చెప్పారు. కానీ, ఒక మహిళ హోమ్ మంత్రిగా ఉన్న ఈ రాష్ట్రంలో స్వాతంత్య్ర‌ దినోత్సవం నాడే నడిరోడ్డుపై ఒక ఉన్మాది ఒక దళిత ఆడ కూతురు రమ్యశ్రీని కత్తితో పొడిచి చంపడం అత్యంత దారుణం. ఆ ఉన్మాదిని కఠినంగా శిక్షించాలి. నిజంగా ఈ దిశ చట్టాలు, యాప్ లు సక్రమంగా పనిచేస్తుంటే ఇలాంటి ఘటనలు రోజూ ఎందుకు జరుగుతాయి? మీకు ప్రచారాల మీద ఉన్న శ్రద్ధ‌ చట్టాన్ని అమలు చేయడంలో ఎందుకు ఉండడం లేదు?’ అని ప‌రిటాల శ్రీ‌రామ్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ప‌రిటాల శ్రీరామ్ స్పంద‌న అందరినీ ఆలోచ‌న‌లో ప‌డేసింద‌నే చెప్పాలి.

Must Read ;- టీడీపీ దెబ్బ‌కు వైసీపీకి బొమ్మ క‌నిపిస్తోందే

Tags: #TheLeoNewsandhra pradeshAndhra Pradesh GunturAndhra Pradesh Newsandhra pradesh news todayap breaking news todayap latest newsap newsbtech studentcongresscrime newsdalitdisha appEngineering student stabbed to death in Andhra PradeshGuntur Government General hospitalguntur latest news updatesguntur urbanHome Minister SucharithakakaniLatest Newslatest news in guntur district todayLatest Telugu Newslatest telugu news onlinemurderRamyasivakrishnastabbed to deathtelugu newsThere Is No Protection For Girls Under The Jagan RegimeToday news VijayawadaVijayawada latest newsVijayawada newsVijayawada news livevijayawada news todaywoman commissionYS Jagan Mohan Reddy
Previous Post

జ‌స్టిస్ ఎన్వీ ధ‌ర్మాగ్ర‌హం.. ఏ ఒక్క‌రిపైనో కాదు

Next Post

నారా లోకేశ్ అరెస్ట్.. టీడీపీ నేత‌ల‌పై ఖాకీ చేయి

Related Posts

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

by లియో డెస్క్
April 29, 2026 7:29 pm

తన కాన్వాయ్‌పై జరిగిన దా*డిపై తీవ్రంగా స్పందించారు మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి...

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

by లియో డెస్క్
April 25, 2026 3:45 pm

ఆంధ్రప్రదేశ్‌లో జగన్‌ హయాంలో జరిగిన వేల కోట్ల మద్యం కుంభకోణం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్...

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

by లియో డెస్క్
April 24, 2026 5:09 pm

ఏపీ సీఎం చంద్రబాబు చెప్పారు.. చేసి చూపిస్తున్నారు. అభివృద్ధిలో ఏపీని దేశంలోనే నెంబర్‌...

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

by లియో డెస్క్
April 24, 2026 2:21 pm

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన పరిటాల రవి, వైఎస్ వివేకానందరెడ్డి హ*త్య కేసుల...

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

by లియో డెస్క్
April 23, 2026 7:14 pm

ఎర్ర బస్సులన్నీ.. ఏసీ బస్సులయితే.. సిటీ సర్వీసుల్లో ఎయిర్‌ కండిషన్‌ సౌకర్యం ఉంటే.....

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

by లియో డెస్క్
April 23, 2026 6:35 pm

రాష్ట్రంలో గ్రీన్ ఎనర్జీకి బూస్ట్‌ ఇచ్చే మరో పరిశ్రమ ఏపీకి వచ్చింది. అనకాపల్లి...

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

by లియో డెస్క్
April 23, 2026 6:07 pm

వైసీపీ MLC అనంతబాబు మరోసారి వార్తల్లోకెక్కారు. దళిత యువకుడు వీధి సుబ్రహ్మణ్యం హ*త్య...

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

by లియో డెస్క్
April 20, 2026 6:24 pm

ఆంధ్రప్రదేశ్‌లో మరో భారీ పరిశ్రమ ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది....

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

by లియో డెస్క్
April 19, 2026 9:43 pm

CM సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి మరోసారి తన పెద్దమనసు చాటుకున్నారు....

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

by లియో డెస్క్
April 19, 2026 6:31 pm

తాడేపల్లి ప్యాలెస్‌లో ఎక్కడ చూసినా ఒకటే మాట వినిపిస్తోంది..సజ్జల ఈజ్ బ్యాక్. గత...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

Glamorous Beauty Kavya Thapar Beautiful Photos

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

బీసీ జనార్దన్ రెడ్డి అరెస్టు పై డీజీపీకి బాబు లేఖ : కర్నూల్ నేతలతో టెలి కాన్ఫరెన్స్

Mind Blowing Hot Photos Of Ketika Sharma

డ్వాక్రా మహిళలకు E-నారి స్కీమ్‌.. పార్ట్‌ టైమ్‌ ప్రభుత్వ ఉద్యోగం..?

ప్రేరేపితమా, పరువు పోయిందనా.. కీసర ఏసీబీ కేసులో వీడని మిస్టరీ

ఎవరి గొంతునైనా.. తన గొంతుతో పలికించే బాలు

కోడి పందాలపై పోలీసుల ఉక్కుపాదం.. రాజు గారిపై కోపమే కారణమా?

శివనామస్మరణలతో మార్మోగుతున్న శైవక్షేత్రాలు!

Janhvi Kapoor looking hot in Saree

ముఖ్య కథనాలు

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

సినిమా

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

బబుల్ గమ్ మూవీ రివ్యూ

బాక్సాఫీసు వద్ద ప్రభాస్ ప్రభంజనం

జనరల్

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

ఏపీకి మరో భారీ పరిశ్రమ.. అనకాపల్లి జిల్లాలో బ్యాటరీ ప్లాంట్‌..!

చంద్రబాబు బర్త్‌ డే.. భార్య భువనేశ్వరి సంచలన గిఫ్ట్‌..

రూ.600 కోట్లు మిస్సింగ్‌.. చెవిరెడ్డిని ఇరికించిన సజ్జల..?

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist