బ్రిటీష్ వారితో తీవ్రంగా పోరాడిన మహాత్మాగాంధీ.. ఆయా అధికారులను గౌరవించి మాట్లాడేవారు. తన అభిప్రాయం తాను నిక్కచ్చిగా చెప్పేవారు.. అదే సమయంలో వారికివ్వాల్సిన మర్యాదను ఇచ్చేవారు. రాజకీయాల్లో ఎంత ఒకరినొకరు తీవ్రంగా విమర్శించుకున్నా.. కక్షగట్టి జనతా పార్టీ జయప్రకాష్ నారాయణను జైలు పాలు చేసినా సరే..ఇందిరాగాంధీ ప్రధాని అయ్యాక.. ఆమెకు ఇవ్వాల్సిన గౌరవం ఆమెకు ఇచ్చారు. కమ్యూనిస్టులకు కాంగ్రెస్‌కు మధ్య బెంగాల్, కేరళలల్లో పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేది. కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఆ రెండు రాష్ట్రాలపై వివక్ష చూపేది. అయినా ప్రధాని రాష్ట్రానికి వస్తే.. ప్రోటోకాల్ ప్రోటోకాల్.. సీఎంలు ఎదురెళ్లి స్వాగతం పలికేవారు. నందమూరి తారక రామారావు సైతం.. కేంద్రంలోని నేతలపై విరుచుకుపడేవారు.. వారు హోదా ప్రకారం రాష్ట్రానికి వస్తే వారి మర్యాదకు ఎక్కడా లోటు రానిచ్చేవారు కాదు. లేటెస్టుగా వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, చంద్రబాబునాయుడు ఇద్దరూ ఒకరినొకరు ఎంతగా విమర్శించుకున్నా సరే..ప్రోటోకాల్ వస్తే ప్రోటోకాల్ అంతే. రాజకీయాల్లోనే ఇంత పాటిస్తే.. మరి అధికారులు,అత్యున్నత హోదాల్లో ఉన్న వ్యక్తులకు ఇంకెంత పాటించాలి. కాని చేయలేదు.
అధినేత అహంకారాన్ని..
అత్యున్నత పదవుల్లో ఉన్న వారిని గౌరవించడం మన విధి. రాజ్యాంగం ప్రకారం వివిధ హోదాల్లో ఉన్నవారిని గౌరవించడం మన సంప్రదాయం. ఉద్యోగులు పై అధికారులను, ఆ అధికారులు ఉన్నతాధికారులను గౌరవిస్తారు. ఒక ప్రోటోకాల్ పాటించడం అనేది మన రోజువారీ విధుల్లో కూడా భాగమైపోయింది. కాని ఏపీ సర్కార్ ఆ సంప్రదాయాలను, ఆనవాయితీని తుంగలోకి తొక్కింది. అధినేత అహంకారాన్ని మంత్రులు, అధికారులు సైతం..అవివేకంతో ప్రదర్శించారు.
Must Read ;- అధికారంతో చెలరేగుతున్నారు.. నీలి మూక అని ఏకేసిన ఆర్కే
తన స్వరాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌కు వస్తే..
అత్యున్నత పదవిలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ ఎన్వీ రమణ.. పైగా మన తెలుగుజాతి ఔన్నత్యాన్ని చాటి చెప్పిన వ్యక్తికి ప్రోటోకాల్ నిబంధనల ప్రకారమైనా స్వాగత ఏర్పాట్లు ఉండాలి. శుక్రవారం ఆయన హైదరాబాద్ వస్తే.. దాదాపు తెలంగాణ కేబినెట్ మొత్తం వచ్చి స్వాగతం పలికింది. ఆయనకు తెలంగాణ రాష్ట్రంలో అందరూ గౌరవ మర్యాదలతో స్వాగతం పలికారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ.. ఆ పదవిని అధిరోహించాక తొలిసారి తన స్వరాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌కు వస్తే ముఖ్యమంత్రి కాదు గదా..ఒక్క మంత్రి కూడా పట్టించుకోలేదు. ఆయన తిరుమలకు వచ్చి వెంకటేశ్వరుని దర్శనం చేసుకుని వెళ్లిపోయారు.
ఆ హోదా రానివ్వకుండా జగన్మోహన్‌రెడ్డి తీవ్రంగా ప్రయత్నించినా..
ఆ హోదా రానివ్వకుండా ఉండాలని జగన్మోహన్‌రెడ్డి తీవ్రంగా ప్రయత్నించిన విషయం అందరికీ తెలిసిందే. ఆయనపై ఆరోపణలు చేయడమే గాక..ఆ ఆరోపణల సారాంశాన్ని కావాలని మీడియా సమక్షంలో బహిర్గతం చేసి అభాసుపాలు చేయాలని ప్రయత్నించారు. అయినా నిజాలు నిగ్గు తేలాక.. ఆ పదవీ ప్రస్థానాన్ని ఎవరూ అడ్డుకోలేకపోయారు. అయినా అవన్నీగుర్తుంచుకుని.. ఏదో కక్షపూరితంగా వ్యవహరించినట్లుగా ఉంది జగన్ సర్కార్ వైఖరి. కేవలం ఇద్దరు ఎమ్మెల్యేలు వెళ్లి స్వాగతం పలకడం అంటే ..వారెలాంటి ప్రాధాన్యత ఇస్తున్నారో చెప్పకనే చెప్పారు.
తాను ఓడిపోయాక..
అయినా తాను ఓడిపోయాక.. ప్రతిపక్ష నాయకుడిగా ఏనాడు ముఖ్యమంత్రిని కలవలేదు. అసలు చంద్రబాబును ముఖ్యమంత్రిగానే గుర్తించలేదు. బీఏసి సమావేశానికి హాజరు కాలేదు..ఏనాడు స్పీకర్ మాట వినలేదు. చివరికి అసెంబ్లీని బహిష్కరించారు. తన మాట వినలేదని సొంత బంధువులపైనే కన్నెర్ర చేసిన వ్యక్తి.. తండ్రి మాటే వినకుండా తలనొప్పులు తెచ్చిపెట్టిన వ్యక్తి.. హితవు చెప్పాలని చూసినందుకు సీనియర్ నేతలనే బయటికి పంపిన వ్యక్తి.. ఎంత ఊడిగం చేసినా తన మాట విననందుకు అధికారులను ఎడంకాలితో తన్ని పంపించిన వ్యక్తి… ప్రోటోకాల్ పాటిస్తాడని.. గౌరవ మర్యాదలు ఇస్తాడని.. సంప్రదాయాలను పాలో అవుతాడని ఎదురు చూడటమే పెద్ద తప్పు.
Must Read ;- తరలిన తెలంగాణ కేబినెట్.. CJI జస్టిస్ ఎన్వీ రమణకు ఘన స్వాగతం











