ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి విశాఖ శారదాపీఠాధిపతి స్వరూపానందకు ఎక్కడ లింకు కుదిరిందో కాని వారి స్నేహం బాగానే వర్ధిల్లింది. అయితే కొంతకాలంగా స్వామి వారిని కొంచెం దూరం పెట్టినట్టు తెలుస్తోంది. అయితే వీరిద్దరికీ చెడిందా? లేదంటే దూరంపెట్టడంలో ఏమైనా రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయా అనే అనుమానాలు వస్తున్నాయి. సీఎం కుటుంబం ఆధ్వర్యంలో నడుస్తున్న మీడియాలో కూడా స్వామి వారి గురించి పెద్దగా కవర్ చేయవద్దంటూ, వారి ఆధ్వర్యంలో నడుస్తోన్న పత్రిక, టీవీ రిపోర్టర్లను ఆదేశించినట్లు వినిపిస్తోంది. దీంతో స్వామి వారిని సీఎం కొంచెం దూరం పెట్టినట్టు పలువురు భావిస్తున్నారు.
Also Read:-కోర్టులో తెర : స్వరూపానందకు అతి మర్యాదలు వద్దట!
స్వామి లీలలు బయటకు రావడమే కారణమా?
విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందపై ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో అనేక కథనాలు ప్రచారంలోకి వచ్చాయి. స్వామి వారికి చదువూ, సంధ్యలులేవని, వయసులో ఉన్నప్పుడు విశాఖలోని ఓ సినిమా హాలులో బ్లాకులో టిక్కెట్లు అమ్మారని ఆయన గురించి తెలసిన కొందరు సోషల్ మీడియాలో వార్తలు పెట్టారు. ఈ వార్తలు వైరల్ గా మారాయి. దీనికితోడు విశాఖలో శారదాపీఠానికి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు అప్పటి మంత్రి ద్రోణంరాజు సత్యనారాయణ అర ఎకరం భూమి ఇప్పించారట. స్వామి వారికి ప్రభుత్వం అర ఎకరం ఇస్తే, దాని పక్కన మరో మూడు ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జాచేసి చక్కగా ఆశ్రమం నిర్మించారని తెలుస్తోంది. దీంతో విశాఖలో ప్రతి వారాంతంలో కూల్చివేతలు చేపడుతున్న వైసీపీ ప్రభుత్వానికి స్వామి వారి ఆశ్రమం కనిపించడం లేదా? అంటూ విశాఖ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. దీంతో వైసీపీ పెద్దలు కూడా స్వామి వారి దర్శనాలు తగ్గించి అంటీ ముట్టనట్టు వ్యవహరిస్తున్నారట.
Must Read:-స్వామీ నీవే దిక్కు.. స్వరూపానంద సన్నిధిలో వెలంపల్లి
విశాఖ ప్రజల్లో స్వామిపై పెద్దగా నమ్మకం లేదట
ఏపీ సీఎం ఎంతో దూరం నుంచి విశాఖ వెళ్లి శారదాపీఠాధిపతి స్వరూపానందను కొలుస్తున్నా, స్వామి వారికి విశాఖలో పెద్దగా భక్తులు లేరట. చిన్నప్పటి నుంచి స్వామి వారి లీలలు స్థానికులందరికీ తెలయడమే ఇందుకు కారణంగా చెబుతున్నారు. స్వామికి విశాఖలో పెద్దగా మంచి పేరు లేకపోవడంతో, విశాఖ స్ధానిక ఎన్నికల్లోనూ ఈ ప్రభావం చూపే అవకాశం ఉందంటున్నారు. అందుకే స్వామిని కొంచె దూరంపెట్టినట్టు తెలుస్తోంది.
Also Read:-అనుబంధం..ఎప్పటినుంచో
ప్రత్యేక మర్యాదల జీవో ప్రభావమా?
విశాఖ శారదాపీఠాధిపతి స్వరూపానంద స్వామి పుట్టినరోజు నాడు ఏపీలోని 23 ప్రధాన దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి, ప్రత్యేక మర్యాదలతో ప్రసాదాలు, కానుకలు సమర్పించుకోవాలని దేవాదాయ శాఖ అదనపు కమిషనర్ ఇచ్చిన మెమో బాగా వివాదం అయింది. చివరకు హైకోర్టులో కేసు కూడా నమోదైంది. స్వామి వారు లేఖ ఉపసంహరణతో వివాదం ముగిసింది. అయితే ఈ వ్యవహారం వైసీపీ పెద్దలకు తెలియకుండా జరిగిందనే ప్రచారం చేసుకుంటున్నారు. దేవాదాయశాఖ కమిషనర్ కు కూడా తెలియకుండా, అదనపు కమిషనర్ మెమో ఇచ్చారని ప్రచారం చేస్తున్నారు.
Also Read:-కోలగట్లను వరించనున్న మంత్రి పదవి!
ఇలాంటి కీలక నిర్ణయం తీసుకునేప్పుడు కమిషనర్ కు, మంత్రికి తెలియకుండా జరిగిందని చెబితే ప్రజలు నమ్ముతారనుకుంటున్నారు. కానీ ప్రత్యేక మర్యాదల మెమో వైసీపీకి బాగా డ్యామేజ్ చేసింది. దీంతో స్వామిని కొంత కట్టడి చేయాలని సీఎం భావిస్తున్నారని తెలుస్తోంది. అందుకే కొంచెం ఇష్టం, కొంచెం కష్టం అంటూ స్వామి సేవలు తగ్గించినట్టు తాడేపల్లి సమాచారం.
Also Read:-రాసిపెట్టుకోండి : మూడేళ్ల తరవాత వైసీపీ ఉండదు











