సుశాంత్ అకౌంట్ నుంచి నగదు బదిలీ అయిందా? ఈ కేసులో సీబీఐ దర్యాప్తులో అనేక కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఈ నగదు బదిలీ వ్యవహారంలో క్యాష్ టాలెంట్ మేనేజ్ మెంట్ కంపెనీ పేరు ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తోంది. ఈ కంపెనీ మేనేజ్ మెంట్ కన్సల్ టెంట్ జయషా ఇందులో కీలక పాత్ర పోషించినట్లు తెలిసింది. దాంతో అతనికి కూడా సమన్లు జారీ చేశారు. ఈ కంపెనీ ద్వారా రియా, షోవిక్ ఖాతాలకు నగదు మళ్లింపు జరిగింది. నగదు బదిలీపై సుశాంత్ తండ్రి కేకే సింగ్ గతంలోనే ఫిర్యాదు చేశారు.
ఈడీ అధికారులు కూడా దీనిపై విచారణ కొనసాగించారు. సుశాంత్ సింగ్ కు సంబంధించిన ఓ బ్యాంకు ఖాతా నుంచి రూ.15 కోట్లు తరలినట్టు అప్పట్లో ఈడీ అధికారులు గుర్తించారు. సుశాంత్ గర్ల్ ఫ్రెండ్ రియా ఖాతాకు ఎలాంటి నగదు బదిలీ కాలేదని అధికారులు గతంలో అన్నారు. తాజాగా ఈ నగదు బదిలీ నిర్ధారణ అయింది. కేసు దర్యాప్తు జరిగే కొద్దీ ఇలాంటి కీలక విషయాలు వెలుగులోకి రావడంతో కేసు డొంక కదులుతోంది. ఈ డబ్బు ఎందుకు బదలాయించవలసి వచ్చింది? ఇందులో ఇంకా ఎవరెవరి పాత్ర ఉంది అనే కోణంలో దర్యప్తు జరుగుతోంది.










