తమిళ హీరో సూర్య ప్రస్తుతం 40వ సినిమాలో నటిస్తున్నాడు. సూర్య 40 గా వ్యవహరిస్తున్న ఈ సినిమాకి పాండిరాజ్ దర్శకుడు. సన్ పిక్చర్స్ బ్యానర్ పై రూపొందుతున్న ఈ సినిమా కథ మధుర బ్యాక్ డ్రాప్ లో ఉంటుంది. నిజానికి ఫిబ్రవరి నెలలో లాంఛ్ అయింది ఈ సినిమా . అప్పుడు సూర్యకి కరోనా పాజిటివ్ రావడం వల్ల.. ఆయన కార్యక్రమానికి హాజరుకాలేకపోయారు. ఆ తర్వాత నుంచి రెగ్యులర్ షూటింగ్ ను ప్రారంభించారు. సూర్య కూడా తర్వాత షూటింగ్ లో పాల్గొన్నారు. ఇటీవల ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ పోస్టర్ కు మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది.
ప్రస్తుతం ఈ సినిమా తమిళనాట ఒక లొకేషన్ లో షూటింగ్ జరుకుంటోంది. కోవిడ్ నిబంధనల్ని పక్కా ఫాలో అవుతూ.. కొన్ని సీన్స్ తీస్తున్నారు. నిజానికి ఈ షెడ్యూల్ లో సూర్య పై ఓ భారీ యాక్షన్ సీన్ ను చిత్రీకరించాలని అనుకున్నాడు దర్శకుడు పాండిరాజ్. ఈ ఫైట్ లో దాదాపు 100 మంది పాల్గొనాల్సి ఉంది. అయితే ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ ఉధృతంగా ఉన్న నేపథ్యంలో దర్శక, నిర్మాతలు ఈ యాక్షన్ సీన్వెన్స్ ను పక్కన పెట్టారట.
అంతమంది గుంపుగా చిత్రీకరణలో పాల్గొనాలి కాబట్టి.. రిస్క్ తీసుకోకూడదని మేకర్స్ నిర్ణయించుకున్నారట. నిజానికి ఈ ఫైట్ సినిమాకే హైలట్ గా నిలుస్తుందట. దర్శకుడు కథ రాసుకున్నప్పుడు ఈ ఫైట్ సీన్ ను ప్లాన్ చేశాడట. అయితే ఆ పైట్ సీన్ ను పక్కన పెట్టడం గమనార్హం. కోవిడ్ తగ్గు ముఖం పట్టాకా.. ఈ సీన్ ను మధురలో భారీగా తీయొచ్చని అనుకుంటున్నారట.
Must Read ;- వెంకీ ‘నారప్ప’ విడుదలకు కూడా చెక్ పెట్టిన సెకండ్ వేవ్