June 8, 2026 3:46 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

టీడీపీ గెలుపు బాట‌కు పునాదులివే

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే కార్య‌క్ర‌మానికి హాజ‌రైన టీడీపీ సీనియ‌ర్ నేత గోరంట్ల బుచ్చ‌య్య చౌద‌రి.. 2024 ఎన్నిక‌ల్లో పార్టీ గెలుపు తీరాల‌కు చేరే దిశ‌గా ఆస‌క్తిక‌ర సూచ‌న‌లు చేశారు.

October 11, 2021 at 2:20 PM
in Andhra Pradesh, Editors Pick, Latest News, Politics, Top Stories
Share on FacebookShare on TwitterShare on WhatsApp

ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ నిర్వ‌హిస్తున్న ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే ప్రోగ్రాంలో ఆదివారం రాత్రి క‌నిపించిన టీడీపీ సీనియ‌ర్ మోస్ట్ నేత‌, తూర్పు గోదావ‌రి జిల్లా రాజ‌మ‌హేంద్ర‌వ‌రం గ్రామీణ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చ‌య్య చౌద‌రి ప‌లు కీల‌క అంశాల‌ను ప్ర‌స్తావించారు. పార్టీలో సీనియ‌ర్ మోస్ట్ నేత‌గా ఉన్నా కూడా.. ఇప్ప‌టికీ పార్టీని అధికారంలోకి తీసుకురావాల‌ని, మ‌రోమారు పార్టీ అధినేత నారా చంద్ర‌బాబునాయుడును సీఎంగా చూడాల‌ని, త‌ద్వారా ఏపీని అభివృద్ధి బాట ప‌ట్టించాల‌ని క‌ల‌లు గంటున్న నేత‌గా గోరంట్ల త‌న మ‌న‌సులోని మాట‌ను గ‌ట్టిగా చెప్పేశారు. పార్టీపై తిరుగుబాటు చేసిన నేత‌గా జ‌నంలో త‌నపై ప‌డిన ముద్ర‌ను కూడా ఈ ఇంట‌ర్వ్యూలో చెరిపేసుకున్నార‌ని కూడా చెప్ప‌క త‌ప్ప‌దు. పార్టీ అధినేత‌గా చంద్ర‌బాబు ఉన్నా.. పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా ఉన్న నారా లోకేశ్ మ‌రింత‌గా వృద్ధిలోకి రావాల‌ని కోరుకునే నేత‌గానూ గోరంట్ల త‌న‌ను తాను ఆవిష్క‌రించుకున్న వైనం ఆస‌క్తి క‌లిగించేదే. అంతేకాకుండా 2024 ఎన్నిక‌ల్లో టీడీపీ మ‌ళ్లీ అధికారంలోకి రావాలంటే ఏం చేయాలి? 2019 ఎన్నిక‌ల్లో పార్టీ ఎందుకు ఓడిపోయింది? పార్టీ ఓట‌మికి దారి తీసిన కార‌ణాలేమిటి? మ‌ళ్లీ వాటిని పున‌రావృతం చేయ‌కుండా సాగేదెలా?.. ఇలా చాలా అంశాల‌ను గోరంట్ల నోట నుంచి వ‌చ్చేలా రాధాకృష్ణ త‌న‌దైన మార్కును చూపారు.

పొర‌పాట్లు పున‌రావృతం కారాదు

2019 ఎన్నిక‌ల్లో టీడీపీ ఓట‌మికి దారి తీసిన కార‌ణాల‌ను గోరంట్ల నిర్భ‌యంగానే బ‌య‌ట‌పెట్టేశారు. 2014 ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబు సామ‌ర్ధ్యం ఆధారంగానే టీడీపీ విజ‌యం సాధించింద‌ని గోరంట్ల చెప్పుకొచ్చారు. ఇప్పుడూ జ‌నంలో అదే భావ‌న వ్య‌క్త‌మ‌వుతోంద‌ని, 2024 నాటికి ఈ భావ‌న మరింత‌గా పెరిగే అవ‌కాశాలున్నాయ‌ని ఆయ‌న చెప్పారు. దీనికి ఏపీ సీఎంగా ఉన్న జ‌గ‌న్ అవ‌లంబిస్తున్న విధానాలే కార‌ణ‌మ‌ని కూడా గోరంట్ల చెప్పారు. అయితే దీనిని బేస్ చేసుకుని టీడీపీ చూస్తూ కూర్చుంటే కుద‌ర‌ద‌ని, జ‌నంలో జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై పెరుగుతున్న వ్య‌తిరేక‌త‌ను క్యాష్ చేసుకునేలా ముందుకు సాగాల‌ని చెప్పారు. దీనికి చాలా మంది పార్టీ నేత‌లు చేస్తున్న షో మాదిరిగా ముందుకు సాగితే కుద‌ర‌ద‌ని కకూడా ఆయ‌న నిర్మ‌గ‌ర్భ వ్యాఖ్య‌లు చేస్తున్నారు. పార్టీ ఇచ్చిన ఆదేశాల మేర‌కు చాలా మంది నేత‌లు ఏదో న‌లుగురైదుగురితో ఫొటోలు తీసుకుని వాటిని పార్టీ అధిష్ఠానానికి పంపితే సరిపోతుందన్న రీతిగా వ్యవహరిస్తున్నారని ఆయ‌న సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. అయితే ఇటీవ‌ల పార్టీ ఇచ్చిన పిలుపు మేర‌కు రోడ్ల దుస్థితిపై పార్టీ చేప‌ట్టిన నిర‌స‌న‌లు రాష్ట్ర ప్ర‌జ‌ల‌ను ఆలోచింప‌జేసిన వైనాన్ని బుచ్చ‌య్య ప్ర‌స్తావించారు. 2014 నుంచి 2019 ఎన్నిక‌ల దాకా ప్ర‌భుత్వ పాల‌న, రాష్ట్రాభివృద్ధిపై పెట్టిన శ్ర‌ద్ధ‌ను చంద్ర‌బాబు పార్టీ నిర్మాణంపై పెట్ట‌లేక‌పోయార‌ని, ఈ కార‌ణంగానే గ‌తంలో ఎన్న‌డూ లేనంత ఘొర ప‌రాభ‌వం పాలైంద‌ని ఆయ‌న చెప్పారు. ఇలాంటి పొర‌పాట్ల‌ను పున‌రావృతం కానీయ‌కుండా చూసుకుంటే.. 2024 ఎన్నిక‌ల్లో టీడీపీ విజ‌యం త‌థ్య‌మ‌ని, మ‌రోమారు చంద్ర‌బాబు సీఎం కావ‌డం ఖాయ‌మ‌ని కూడా గోరంట్ల చెప్పుకొచ్చారు. పార్టీలో యువ‌నేత‌లు మ‌రింత మెరుగ్గా రాణించాల్సిన అవ‌స‌రం ఉంద‌ని, అలాగ‌ని త‌మ‌లాంటి సీనియ‌ర్ల‌ను ప‌క్క‌న‌పెట్ట‌డం స‌రికాద‌న్నారు. పార్టీలో వ‌ర్గ విభేదాల‌కు ఎప్ప‌క‌టిప్పుడు చెక్ పెట్టేలా చ‌ర్య‌లు చేప‌ట్టాల‌న్నారు. పార్టీ అభ్య‌ర్థులుగా ఎంపిక చేసే నేత‌ల విష‌యంలో అధిష్ఠానం మరింత జాగ్ర‌త్త వ‌హించాల్సి ఉంద‌న్నారు. పార్టీకి ద్రోహం చేసే నేత‌ల‌ను ఏమాత్రం ప్రోత్స‌హించ‌రాద‌ని కూడా గోరంట్ల చెప్పుకొచ్చారు. పార్టీ పొలిట్ బ్యూరోను మరింత యాక్టివేట్ చేయాల్సిన అవ‌స‌రం ఉంద‌ని ఆయ‌న అభిప్రాయ‌ప‌డ్డారు.

చంద్ర‌బాబు ఓ విజ‌న‌రీ!

పార్టీ అధినేత నారా చంద్ర‌బాబునాయుడిని ఓ విజ‌న‌రీగా బుచ్చ‌య్య అభివ‌ర్ణించారు. నేడు సైబ‌రాబాద్ ఆ స్థాయిలో అభివృద్ధి చెందింద‌న్నా.. రాజ‌ధాని కూడా లేకుండానే కొత్త ప్ర‌స్థానం ప్రారంభించిన న‌వ్యాంధ్ర‌కు రోజుల వ్య‌వ‌ధిల‌తోనే అంద‌రికీ ఆమోద‌యోగ్య‌మైన‌, అంద‌రికీ అందుబాటులో ఉండేలా అమ‌రావ‌తిని రాజ‌ధానిగా ఎంపిక చేసేలా వ్య‌వ‌హ‌రించిన చంద్ర‌బాబు త‌న‌పై జ‌నం పెట్టుకున్న న‌మ్మ‌కాన్ని నిల‌బెట్టుకున్నార‌ని గోరంట్ల తేల్చేశారు. అయినా ఇల్లు క‌ట్టుకునేందుకే రెండు, మూడేళ్లు ప‌డుతుంటే.. ఓ రాజ‌ధానిని నిర్మించ‌డానికి ఐదేళ్లు స‌రిపోతాయా? అని త‌న‌దైన శైలి ప్ర‌శ్న‌ల‌ను సంధించిన బుచ్చ‌య్య‌.. ఈ విష‌యంలో వైసీపీ చేసిన దుష్ప్ర‌చారాన్ని తిప్పికొట్టే విష‌యంలో టీడీపీ ఘోరంగా విఫ‌ల‌మైంద‌న్నారు. రాజ‌ధానిని అభివృద్ధి చేసే విష‌యంపైనే దృష్టి పెట్టిన చంద్ర‌బాబు.. అదే రాజ‌ధానిపై విప‌క్షం చేస్తున్న దుష్ప్ర‌చారాన్ని తిప్పికొట్టే విషయాన్ని మాత్రం అంత‌గా ప‌ట్టించుకోలేదని చెప్పారు. అయితే రెండున్న‌రేళ్ల జ‌గ‌న్ పాల‌న చూశాక జ‌నం తాము చేసిన పొర‌పాటును గుర్తించార‌ని, వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి చంద్ర‌బాబు ఓ స్ట్రాట‌జీతో ముందుకు సాగితే.. టీడీపీ విజ‌యాన్ని ఎవ‌రూ అడ్డుకోలేర‌ని గోరంట్ల చెప్పుకొచ్చారు. చంద్ర‌బాబు సీఎం అయితే ఏపీలో మ‌ళ్లీ అభివృద్ధి ప‌ట్టాలెక్కుతుంద‌న్న విష‌యంపై జ‌నం ఇప్ప‌టికే ఓ అంచాన‌కు వ‌చ్చార‌ని పేర్కొన్నారు. ఈ ద‌ఫా చంద్ర‌బాబు అధికారంలోకి వ‌స్తే.. కేంద్రంలో ఏ పార్టీ ప్ర‌భుత్వం ఉన్నా కూడా ఏపీ అభివృద్ధికి ఎలాంటి ఆటంకం ఉండ‌బబోద‌ని కూడా ఆయ‌న చెప్పారు. ఏపీలో టీడీపీని అధికారంలోకి తెచ్చేందుకు, చంద్ర‌బాబును మ‌రోమారు సీఎంగా చూసేందుకు త‌న శ‌క్తివంచ‌న లేకుండా కృషి చేయ‌డానికి సిద్ధంగా ఉన్నాన‌ని, ఈ క్ర‌మంలో త‌న‌కు పార్టీ నుంచి టికెట్ ద‌క్కినా, ద‌క్క‌కున్నా కూడా వెన‌క్కు త‌గ్గేదే లేద‌ని కూడా గోరంట్ల చెప్పారు.

Must Read ;- మార్పు మొద‌లైంది!.. టీడీపీ వైపు ప్ర‌కాశం రెడ్లు!

Tags: #TheLeoNewsabn andhrajyothyandhra pradeshAndhra Pradesh Newsandhra pradesh news todayap breaking news todayAP cm jaganap latest newsap newsap politicsEditorspickgorantla buchaiah chowdaryLatest NewsLatest Telugu Newslatest telugu news onlineleo newsleo political newsNCBNopen heart with rktdptdp national president nara chandrababunaiduTelugu Desam Party (TDP)telugu news
Previous Post

మెగా ఓటమికి ఇదే ‘జీవిత’ సత్యం

Next Post

బాల‌య్య‌తో ప్ర‌శాంత్ వ‌ర్మ‌.. ఇది వాస్త‌వ‌మేనా?

Related Posts

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

by లియో డెస్క్
June 6, 2026 3:47 pm

ఆంధ్రప్రదేశ్‌లో బ్లూ ఎకానమీ అభివృద్ధిపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టారు. దేశంలోనే...

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

by లియో డెస్క్
June 5, 2026 3:28 pm

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు విశాఖపట్నం వేదికగా సరికొత్త చరిత్రకు...

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

by లియో డెస్క్
June 4, 2026 1:40 pm

జనసేన చీఫ్‌ పవన్ కళ్యాణ్ తెలంగాణ రాజకీయాల్లో పోటీ చేయబోతున్నారనే అంశంపై సోషల్...

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

by లియో డెస్క్
May 28, 2026 10:09 am

యువగళం రథసారథి, టిడిపి జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ ప్రోత్సాహం రెండు...

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

by లియో డెస్క్
May 24, 2026 7:17 pm

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెప్పిన మాటలకు...

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

by లియో డెస్క్
May 20, 2026 6:48 pm

ఇంటర్నేషనల్‌ కంపెనీలు విశాఖపట్నంలో ఆఫీసులు ఓపెన్‌ చేయడానికి వరుస కడుతున్నాయి. ఇప్పటికే డజన్ల...

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

by లియో డెస్క్
May 18, 2026 10:39 pm

Social Mediaనారా, నందమూరి కుటుంబాల మూడో తరం వారసుడు, IT మంత్రి నారా...

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

by లియో డెస్క్
May 13, 2026 6:52 pm

ఏపీ రాజకీయాల్లో అనూహ్య మార్పులు జరగబోతున్నాయా..గత పదేళ్లుగా కేంద్రంలోని కేంద్రంలోని బీజేపీతో లోపాయకారీ...

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

by లియో డెస్క్
May 11, 2026 5:53 pm

వైసీపీ ఫైర్ బ్రాండ్, మాజీ మంత్రి రోజా తాజాగా టీవీ-9 ఇంటర్వ్యూలో చేసిన...

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

by లియో డెస్క్
May 11, 2026 4:17 pm

వైసీపీ మహిళా నేతలలో రగడ మొదలయిందా..? ఒకరిపై ఒకరు రాజకీయాలు మొదలు పెట్టారా..?...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

అందాల ఆరబోతలో శ్రీదేవి కూతురా మజాకా!

తలసేమియా బాధితులకి అండగా పవన్ కళ్యాణ్ అభిమానులు

ప్యాన్ ఇండియా ప్రాజెక్టుగా మరో ఘోస్ట్

ఐఏఎస్ మళ్లీ చదువుకుని రావాలట.. జగన్ జమానాలో ఎన్నెన్ని వింతలో!

సర్పంచ్ లకు చెక్ పెట్టడం.. ప్రజాస్వామ్యానికి చేటు!

నలుగురు టిడిపి ఎమ్మెల్యేల సస్పెన్షన్

పెద్దోళ్ల జోలికెళ్లకుండా.. చిన్నోళ్ల మీదనే కేసులా?

ముఖ్య కథనాలు

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

సినిమా

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

బబుల్ గమ్ మూవీ రివ్యూ

జనరల్

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

వైఎస్‌ రాజారెడ్డి రక్త చరిత్ర.. మొత్తం బయటపెట్టిన ప్రత్యర్ధి..

ఏపీకి మరో గ్లోబల్‌ ఐటీ జెయింట్‌.. వైజాగ్‌లో డెలాయిట్‌..

నారా వారసుడి డిజిటల్ ఎంట్రీ.. దేవాన్ష్ పాడ్‌కాస్ట్‌కి సోషల్‌ మీడియా షేక్‌..

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist