మలయాళ యంగ్ సూపర్ స్టార్ దుల్కర్ సల్మాన్ .. ప్రస్తుతం మలయాళంలో కురుప్పు అనే పాన్ ఇండియాలో మూవీలో నటిస్తున్నాడు. అలాగే.. సాల్యూట్ అనే ఓ పోలీస్ థ్రిల్లర్ లో కూడా నటిస్తున్నాడు. దాంతో పాటు ‘హే సినామికా’ అనే ఓ తమిళ రొమాంటిక్ కామెడీ మూవీలో కూడా నటిస్తున్నాడు. ప్రముఖ కొరియో గ్రాఫర్ బృంద మాస్టర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను.. జియో స్టూడియోస్, గ్లోబల్ సినీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కాజల్ అగర్వాల్ , అదితీరావు హైదరి కథానాయికలుగా నటిస్తున్న ఈ సినిమాకి గోవింద్ వసంత సంగీతం అందిస్తున్నారు.

ఇక హే సినామిక సినిమాకి సంబంధించిన మరో విశేషమేంటంటే.. దీని కోసం దుల్కర్ సల్మాన్ ఓ పాట స్వయంగా పాడాడు. గతంలో దాదాపు 10 మలయాళ సినిమాల్లో దుల్కర్ సూపర్ హిట్ పాటల్ని పాడి.. మలయాళీలను మరిపించాడు. ఈ సారి తొలిసారిగా తన గాత్ర మాధుర్యాన్ని తమిళయన్స్ కు వినిపించడానికి సిద్ధమయ్యాడు. బాహుబలి సినిమాలో కాలకేయుల కిలికి భాష ను క్రియేట్ చేసిన మదన్ కర్కి ఈ పాటను రచించడం విశేషం. దుల్కర్ సల్మాన్ ఈ విషయాన్ని తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా తెలియచేశాడు. అతి త్వరలో విడుదల కాబోతున్న హే సినామిక సినిమాకి .. దుల్కర్ పాట ఏ రేంజ్ లో హైలైట్ కానుందో చూడాలి.
Must Read ;- పోలీసాఫీసర్ గా దుల్కర్ సల్మాన్
Sang for the first time in tamizh for our beloved film #HeySinamika !! It’s a super cool track ! Govind’s epic music, Madan sirs soulful lyrics & Brinda masters brilliant direction!Blessed! @brindagopal @aditiraohydari @MsKajalAggarwal @madhankarky @govind_vasantha @jiostudios pic.twitter.com/PZOGglZkag
— Dulquer Salmaan (@dulQuer) April 14, 2021










