సీనియర్ స్టార్ హీరో, ప్రొడ్యూసర్ టి. రాజేంద్ర తనయుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అనతికాలంలోనే మంచి పేరు తెచ్చుకున్నాడు శింబు. ‘మన్మధ’ సినిమాతో తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు శింబు. ఆ తర్వాత తెలుగులో వచ్చిన ‘వల్లభ’ సినిమా కూడా విజయం సాధించడంతో టాలీవుడ్ లో కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్నాడు శింబు. అయితే ఇతడు సినిమాలకు తక్కువ, వివాదాలకు ఎక్కువ. తరుచుగా ఏదో ఒక వివాదంలో తలదూర్చితే కానీ బాబుకి నిద్రపట్టదు.
అయితే ఇప్పుడు ఎవరు ఊహించని ట్రాన్స్ ఫర్మేషన్ తో కోలీవుడ్ సినీ వర్గాలను స్టన్ చేసాడు శింబు. సడన్ గా తను 101 కేజీల బరువు నుంచి 70 కేజీలకు తగ్గి అందరిని ఆశ్చర్యపరిచాడు. ఈమధ్య కాలంలో సినిమాల కోసం అనేక మంది స్టార్ హీరోలు, హీరోయిన్లు బరువు తగ్గడం కామన్ అయిపొయింది. అయితే శింబు మాత్రం మిగిలిన హీరోల మాదిరిగా సినిమాల కోసం బరువు తగ్గలేదు. తాను పర్సనల్ గా తనకి తాను ఛాలెంజింగ్ గా ఫీలయి ఇదంతా చేశాడట శింబు.
తను 101కేజీలు బరువు పెరిగానని ఇక సన్నపడటం అసాధ్యమని కొంతమంది అన్నారని, అందుకనే బరువు తగ్గించి చుపించానని తెలిపాడు శింబు. తను తగ్గిన లేటెస్ట్ ఫోటోలను ట్విట్టర్ ద్వారా షేర్ చేసిన శింబు, ఆ ఫోటోలలో చాలా స్లిమ్ గా దర్శనం ఇచ్చాడు. మొత్తానికి శింబు చూపిన ఈ సడెన్ చేంజ్ చూసి కోలీవుడ్ ఇండస్ట్రీ వర్గాలు మాత్రమే కాకుండా ఆయన అభిమానులు సైతం ఆశ్చర్యపోతున్నారు.
తమ అభిమాన హీరో సడన్ చేంజ్ మాకు బాగా నచ్చిందని అభిమానులు వాపోతున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే శింబు ప్రస్తుతం ‘ఈశ్వరుడు’ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేయనున్నట్లు ఇప్పటికే నిర్మాతలు ప్రకటించిన విషయం తెలిసిందే.
Thanks to the supreme power for guiding & helping me throughout this transformation.
&
Thanks to all my fans for showering unconditional love, your love means the world to me 🙏🏻Forever greatful,
Love #SilambarasanTR #Eeswaran #Atman #Spreadlove #SpreadPositivity pic.twitter.com/K68jtUMdAh— Silambarasan TR (@SilambarasanTR_) October 29, 2020