సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ శ్రుతీహాసన్ ప్రస్తుతం తమిళంలో విజయ్ సేతుపతి సరసన హీరోయిన్ గా ఒక సినిమాలో నటిస్తోంది. కరోనా కారణంగా సినిమా షూటింగ్ మధ్యలోనే నిలిచిపోయి మళ్ళీ ఈమధ్యనే తిరిగి మొదలైంది. అయితే షూటింగ్ నుండి మధ్యలోనే వెళ్లిపోయి.. హీరోయిన్ శ్రుతీహాసన్ అందరికీ షాకిచ్చింది. దర్శకుడు ఔట్ డోర్ లో విజయ్ సేతుపతి, శ్రుతీహాసన్ పై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నాడు. ఆ సమయంలో వందల మంది ప్రజలు ఆ సినిమా షూటింగ్ ను చూడడానికి ఎగబడ్డారు. దీనితో అక్కడ గందరగోళం ఏర్పడింది. అంతమంది జనం షూటింగ్ చూడడానికి రావడంతో శ్రుతీహాసన్ అక్కడ నుండి కోపంగా వెళ్లిపోయింది.
కనీస జాగ్రత్తలు తీసుకోకుండా షూటింగ్ ను ఎలా జరుపుతున్నారని సినిమా యూనిట్ సభ్యులపై ఆగ్రహం వ్యక్తం చేసింది శ్రుతి. ఆమె అర్ధాంతరంగా వెళ్లిపోవడంతో షూటింగ్ కు పేకప్ చెప్పేసింది చిత్ర బృందం. ఈ విషయం కోలీవుడ్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. దీనిపై హీరోయిన్ శ్రుతీహాసన్ స్పందించింది. ఈ సమయంలో ప్రతి ఒక్కరి ఆరోగ్యం ముఖ్యమని, కరోనా మన దేశం నుండి ఇంకా పోలేదని, ప్రతి ఒక్కరు సోషల్ డిస్టెన్స్ పాటించాలని అన్నారు ఆమె. షూటింగ్ లో అందురూ తమ యొక్క ప్రొటోకాల్ పాటించాల్సిందేనని, లేకపొతే ఒక మహిళగా నా ఆరోగ్య జాగ్రత్తలు నేను చూసుకుంటానని తెలిపింది శ్రుతి.
షూటింగ్ ను చూడడానికి వందల మంది జనాలు రావడంతో అక్కడ గందరగోళ పరిస్థితిలు ఏర్పడ్డాయని, తన ఆరోగ్యం పట్ల ముందు చూపుతో షూటింగ్ మధ్యలోనే వచ్చేశానని ఆమె తెలిపింది. అయితే ఇప్పటివరకు శ్రుతీహాసన్ తీరుపై సినిమా యూనిట్ ఎటువంటి వ్యాఖ్యలు చేయకపోవడం విశేషం. ఇక శ్రుతి స్పందనను విన్న నెటిజన్లు ఆమెకు మద్దతుగా నిలిచారు. ఆమె షూటింగ్ మధ్యలోనే వచ్చేయడం సరైన చర్యని వారు అంటున్నారు. ఔట్ డోర్ లో షూటింగ్ చేస్తున్నప్పుడు చిత్ర యూనిట్ తగు చర్యలు తీసుకోవాలని అభిప్రాయపడ్డారు.
Must Read ;- లీగల్ సమస్యల్లో మాస్ మహారాజా సినిమా