బాలీవుడ్ లో అత్యంత స్టైలిష్ గా అలాగే సంప్రదాయంగా కనపడే హీరోయిన్స్ గురించి మాట్లాడినప్పుడు మనకు టక్కున గుర్తుకు వచ్చే పేరు దిశా పటాని. 2015లో బాలీవుడ్ లో అడుగుపెట్టిన దిశా అప్పటినుండి కొత్త కొత్త ఫ్యాషన్ వేర్ తో ప్రేక్షకులను అలరిస్తోంది. సినిమాలతోనే కాకుండా తన డ్రెస్సింగ్ ద్వారా కూడా ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంది దిశా. ఆమె రాత్రి కారు దిగి ఆటో ఎక్కి సిటీ మొత్తం చక్కెర్లు కొట్టి ఇంటికి చేరింది దిశా పటాని.

ఆమె నలుపు రంగు ఫ్రంట్-జిప్ టాప్ దానికి మ్యాచింగ్ జాగర్స్ ధరించి సహజంగా కనిపించింది. అలాగే తెలుపు రంగు స్నీకర్ల జతతో కూడిన బ్లాక్ కో-ఆర్డ్స్‌లో అద్భుతంగా కనిపిస్తోంది. అంతేకాకుండా చేతికి తెలుపు రంగు బ్యాండ్, కోవిడ్ 19 నియమ నిబంధనలను పాటిస్తూ ఆమె నల్ల మాస్క్ పెట్టుకొని, జుట్టును గాలికి వదిలేసి అందంగా ఉంది దిశా పటాని.
కొంతమంది ఫొటోగ్రాఫర్లు ఆమెను ఇంటివరకు అనుసరించి ఫోటోలు తీయడానికి ఎగపడ్డారు. ప్రస్తుతం ఆమె ఆటో ప్రయాణం ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దిశా అభిమానులు వీటిపై పాజిటివ్ గా స్పందిస్తున్నారు. ఇంకొంతమంది నెటిజన్లు అయితే టైగర్ ష్రాఫ్ ఎక్కడా అని చిలిపిగా అడుగుతున్నారు. ఆమె ఆటోలో ప్రయాణించడం కొత్తేమీ కాదు. ఇదివరకు కూడా ఒకసారి సడన్ గా కారు దిగి ఆటోలో ప్రయాణం చేసింది దిశా. ఇక సినిమాల విషయానికి వస్తే ఆమె చివరిసారిగా ‘మలంగ్’ సినిమాలో కనిపించింది. దిషాతో పాటుగా ఈ చిత్రంలో ఆదిత్య రాయ్ కపూర్, అనిల్ కపూర్, కునాల్ కెమ్ము కూడా నటించారు. ఆమె ప్రస్తుతం సల్మాన్ ఖాన్ తో ‘రాధే’ సినిమాలో నటిస్తోంది. దీనికి ప్రభుదేవా దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే ఏక్తా కపూర్ తో చేస్తున్న ‘కెటినా’లో కూడా దిశా కనిపించనున్నది.
Must Read ;- ఇన్ స్టా లో ‘అనన్య’ సామాన్యమైన అందాలు.. !
https://www.youtube.com/watch?v=dbU7tS3mY6g










