క్రియేటివ్ జీనియస్ , సౌత్ ఇండియాలోని నెం.1 దర్శకుల్లో ఒకరైన శంకర్ పై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. చెన్నైలోని ఎగ్మూర్ లోని మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్ట్ ఆయనపై ఈ వారెంట్ జారీచేసింది. రోబో సినిమా తన కథనేనని.. జిగూబా అనే పేరుతో తాను రాసుకొన్న కథనే కాపీ కొట్టి శంకర్ రోబో సినిమా తీశారని.. అరుళ్ తమిళ నందన్ అనే తమిళ రచయిత గతంలో ఆయనపై స్థానిక కోర్ట్ ను ఆశ్రయించాడు.
దీంతో శంకర్ విచారణకు హాజరు కావాలని, న్యాయస్థానం ఇప్పటికి ఎన్నో సార్లు ఆదేశించినా.. శంకర్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాకపోవడమే కాకుండా.. శంకర్ న్యాయస్థానం ముందు హాజర్ కాకపోవడంతో ఆయన పేరు మీద నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది కోర్ట్. అంతేకాకుండా.. ఈ కేసు విచారణను ఫిబ్రవరి 19వ తేదీకి వాయిదా వేసింది.
Must Read ;- మళ్లీ వార్తల్లోకి ‘భారతీయుడు 2’.. అసలు ఈ మూవీ ఉందా.? లేదా.?










