మాలీవుడ్ టాలెంటెడ్ హీరో ఫహద్ ఫాజిల్ నటించిన సరికొత్త మలయాళ థ్రిల్లర్ ‘ఇరుల్’ ( చీకటి). లాక్ డౌన్ కాలంలో కేవలం మొబైల్ ఫోన్ తో చిత్రీకరించి.. మంచి పేరు తెచ్చుకున్న థ్రిల్లర్ మూవీ ‘సీ యూ సూన్’ గుర్తుంది కదా. ఆ మూవీలో నటించిన టాలెంటెడ్ హీరోయిన్ దర్శన రాజేంద్రన్ ఇందులో హీరోయిన్ గా నటించింది. ఆంటో జోసెఫ్ ఫిల్మ్స్ , ప్లాన్ జె స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ సినిమాని నసీర్ యూసఫ్ యుసిద్దీన్ తెరకెక్కించాడు. ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్ ఆకట్టుకుంటోంది.
సినిమాలో చాలా భాగం చీకట్లోనే చిత్రీకరించడం ‘ఇరుల్’ సినిమా ప్రత్యేకత. అంతేకాదు.. ఈ మూవీ జనాన్ని బాగానే భయపెట్టేలా కనిపిస్తోంది. ఏప్రిల్ 2న ఈ సినిమా డైరెక్ట్ గా నెట్ ఫ్లిక్స్ లో విడుదల కాబోతోంది. ఐదుగురు మహిళల మర్డర్ మిస్టరీ తో ఈ సినిమా తెరకెక్కింది. ఇక ఇందులో మరో ప్రధాన పాత్రలో సౌబిన్ షాహిర్ నటించాడు. ఆహాలో విడుదలైన ‘ట్రాన్స్’ సినిమాతో ఫహద్ ఫాజిల్ తెలుగు ప్రేక్షకులకూ బాగా సుపరిచితుడయ్యాడు. మరి ఇరుల్ సినిమా ప్రేక్షకుల్ని ఏ రేంజ్ లో ఆకట్టుకుంటుందో చూడాలి.
Also Read:ట్రైలర్ టాక్ : కేరళ ముఖ్యమంత్రిగా మమ్ముట్టి ‘వన్’