తమిళ్ స్టార్ హీరో ధనుష్ ‘జగమే తందిరం‘ సినిమాతో బిజీగా ఉన్నాడు. కార్తిక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్ గా నటిస్తోంది. దీనితో పాటు మరో రెండు సినిమాలను లైన్ లో పెట్టాడు ధనుష్. ఇప్పుడు మరో పాన్ ఇండియా కథతో ప్రేక్షకుల ముందుకు రావడానికి ధనుష్ సిద్దమవుతున్నాడని కోలీవుడ్ సమాచారం. ‘రాక్షసన్’ ఫేమ్ రామ్‌కుమార్ దర్శకత్వంలో ఈ సినిమా ఉందనున్నదని తెలుస్తోంది.
నిజానికి ధనుష్ ఇప్పటికే ఈ కథను ఓకే చేసి రెండు సంవత్సరాలు అయ్యింది. కాకపోతే అందులోని కొన్ని సన్నివేశాలు మార్చాలని ధనుష్ అప్పట్లో దర్శకుడికి తెలిపాడు. ఏమైందో ఏమోగాని అప్పట్లో ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్ళలేదు. ఇంతకాలం తర్వాత మళ్ళీ ఈ కథతో సినిమా తెరకెక్కుతోంది. దర్శకుడు రామ్ కుమార్ మార్చిన సన్నివేశాలతో కూడిన కథను ఇటీవలే ధనుష్ ను కలిసి వినిపించాడని, ఆ కథ ధనుష్ కు నచ్చడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని కోలీవుడ్ టాక్. ‘జగమే తందిరం‘ సినిమా తర్వాత ధనుష్ ఈ సినిమానే చేస్తాడని సమాచారం.
ఇప్పటికే ధనుష్ బాలీవుడ్ లో అనేక సినిమాలలో నటించాడు. అందులో కొన్ని మంచి విజయాలు కూడా సాధించాయి కూడా. అందుకనే దర్శకుడు పాన్ ఇండియా స్థాయిలో సినిమా చేయడానికి నిర్ణయించుకున్నాడు అని తెలుస్తోంది. వచ్చే ఏడాది జూన్ నెలలో ఈ చిత్ర షూటింగ్ సెట్స్ పైకి వెళ్లనున్నదని తెలుస్తోంది. ప్రస్తుతం ధనుష్ బాలీవుడ్ లో ‘అత్రంగీ రే’ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక తమిళ్ లో ధనుష్ చేస్తున్న ‘జగమే తందిరం‘ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇందులో ధనుష్ కొత్తగా కనిపిస్తాడని ఇప్పటికే దర్శకనిర్మాతలు తెలియజేసారు కూడా. ఇలా ధనుష్ వరుస సినిమాలతో దూసుకుపోతూ తన తోటి హీరోలకు సవాలు విసురుతున్నాడు.
Must Rwa;- అల్లుడు శీను బాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తాడా?










