October 29, 2026 7:28 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

టీటీడీ ద్వంద్వనీతి : భక్తులందు.. ‘సొంత’ భక్తులు వేరయా?

టీటీడీ అధికారులు అనుసరించే సవాలక్ష వక్రమార్గాల్లో మరొకటి జత చేరింది. భక్తుల్లో కూడా వైసీపీ పార్టీ ముద్ర ఉన్న వారిని ప్రనత్యేంగా పరిగణించడం విమర్శల పాలవుతోంది.

December 23, 2020 at 8:39 PM
in Andhra Pradesh, Latest News, Opinion
venkanna hd
Share on FacebookShare on TwitterShare on WhatsApp

భగవంతుడి దృష్టిలో సకల మానవాళి సమానమే! భక్తులందరూ సమానమే. సామాన్య భక్తులు- ప్రత్యేక భక్తులు అనే వ్యత్యాసాలు దేవుని దృష్టిలో ఉండవు. కానీ, దేవుడి మీద పెత్తనం చేయడానికే తమ పదవులు వచ్చాయని భావించే పాలకమండళ్లకు మాత్రం ఉంటాయి. అధికార్లకు మాత్రం ఉంటాయి. తాజాగా.. తిరుమల తిరుపతి దేవస్థానాల విషయంలో వారి వ్యవహార సరళిని గమనిస్తే మాత్రం మనకు ఇలాంటి అభిప్రాయమే కలుగుతుంది.

పార్ట్ 1 : ఏం జరిగిందంటే..

మంగళవారం నాడు కొన్ని వేల మంది భక్తులను తిరుమల గిరులకు రానివ్వకుండా.. టీటీడీ అధికారులు తిరుపతిలోనే ఆపివేశారు. దీనికి వాళ్లు పద్ధతిగానే కారణం చెప్పుకున్నారు. తిరుమలలో అయిదురోజుల పాటు తిరుపతి/స్థానికులకు మాత్రమే దర్శనావకాశం కల్పిస్తామని.. దూర ప్రాంతాల నుంచి భక్తులు ఎవ్వరూ రావద్దని కొన్నిరోజుల ముందే ప్రకటించారు. అయితే ముందుగా టికెట్లు పొందిన వారిని మాత్రం అనుమతించారు. కొవిడ్ అనంతర సమయంలో.. అసలు తిరుమలలో దర్శనం టికెట్లనే విక్రయించడం లేదు. తిరుపతిలోనే టికెట్లు ఇస్తున్నారు. అవి ఉన్నవారిని మాత్రమే తిరుమలకు అనుమతిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆన్ లైన్ లో ముందే పొందిన వారు, లేదా, తిరుపతిలో టికెట్ కొన్న వారు మాత్రమే తిరుమలకు వెళ్లగలరు. కానీ- మంగళవారం పరిస్థితి గమనిస్తే.. తిరుపతిలో టికెట్ కౌంటర్లలో స్థానికులకు మాత్రమే వారి ఆధార్ కార్డుల్లో చిరునామా చెక్ చేసి మాత్రమే టికెట్లు విక్రయించారు. ఈ నేపథ్యంలో నిబంధనలు తెలియకుండా తిరుపతి వరకు వచ్చేసిన వేల మంది భక్తులు ఇబ్బంది పడ్డారు. తిరుపతిలో టికెట్లు అమ్మడం లేదు- తిరుమలకు అనుమతించడం లేదు. వీరంతా గొడవ చేశారు. కానీ… వారికి పరిష్కారం దొరకలేదు. అధికారులు కనికరించలేదు. దాదాపు అయిదువేల మంది ఇలా ఇబ్బంది పడ్డారు.

Must Read ;- తిరుమల పవిత్రతకోసం గర్జించిన నారా లోకేష్

పార్ట్ 2 : వాళ్లు మాత్రం చాలా స్పెషల్

ఇదే రోజున ఇంకో ఎపిసోడ్  జరిగింది. కడప జిల్లాలో వైసీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే ఆకేపాటి అమర్ నాధ్ రెడ్డి దాదాపు రెండువేల మందిని వెంటేసుకుని.. అన్నమయ్య మార్గంలో తిరుమలకు కాలినడకన వచ్చారు. వీరందరూ ముందస్తుగా టికెట్లు తీసుకున్న వారు కాదు. అయితే మొత్తం ఈ రెండు వేల మందిని మాత్రం.. అధికారులు దర్శనానికి అనుమతించారు.

ఇదే సమయంలో.. పాదయాత్రగా తిరుమలకు వస్తూ.. డ్రోన్ తో తమ కాలినడకను చిత్రీకరింపజేసుకుంటూ అమర్ నాధ్ రెడ్డి, ఆయన వెంట వచ్చిన గడికోట శ్రీకాంత్ రెడ్డి ప్రదర్శించిన అత్యుత్సాహానికి మాత్రం టెంకిజెల్ల పడింది. డ్రోన్‌ను విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకుని, అందులోని ఫుటేజీ మొత్తం డిలిట్ చేశారు. కేసు కూడా నమోదు చేశారు. ఆగమ విరుద్ధంగా, నిబంధనలను అతిక్రమించి.. డ్రోన్ వాడినందుకు ఈ మాత్రం స్పందించిన అధికారులు.. ఇలా అడ్డగోలుగా.. కాలినడకన వచ్చేసిన రెండు వేల మందికి ఎలా అనుమతులు కల్పించారో మాత్రం అర్థం కాని సంగతి.

ఎందుకు అడ్డుకోలేకపోయారు?

తిరుపతిలో అయిదువేల మందిని తిరుమలకు  రానివ్వకుండా అడ్డుకున్న అధికారులు, ఈ రెండు వేల మంది విషయంలో ఏమీ చేయలేకపోయారా? అనే సందేహం ఎవరికైనా వస్తుంది. కాకపోతే.. తిరుమలకు కాలినడకన రావడానికి అలిపిరి, శ్రీవారిమెట్టు రెండు మార్గాలు ఉంటాయి. ఈ రెండు మార్గాల్లో పక్కా ఏర్పాట్లు, సెక్యూరిటీ, భద్రత వసతులు ఉంటాయి. అయితే కడపజిల్లా నుంచి ఉండే అన్నమయ్య మార్గంగా  పిలిచే కాలినడక దారి.. వసతులు ఉండవు. దీన్ని బాగు చేయాలనేదే ఆకేపాటి డిమాండు. ఆ మార్గంలో వచ్చే వారిని అడ్డుకోడానికి కూడా వ్యవస్థ లేదు. అందువల్లనే.. వారంతా తిరుమల వచ్చేయగలిగారు. వచ్చేశారు సరే.. వారందరికీ దర్శన భాగ్యం కల్పించడం మాత్రం.. అధికారులు రాజకీయ ఒత్తిడికి లోబడి తీసుకున్న నిర్ణయంగానే ఇప్పుడు విమర్శల పాలవుతోంది.

దుయ్యబట్టిన చంద్రబాబు

టీటీడీ అధికారులు ద్వంద్వ వైఖరిని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తీవ్రస్థాయిలో దుయ్యబట్టారు. అధికారులు నిబంధనల్ని, ఆచారాల్ని కూడా తుంగలో తొక్కారని అన్నారు.

‘‘అధికారంలోకి వచ్చినప్పటి నుండి ప్రభుత్వం తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్ట మంటగలిపేలా వ్యవహరిస్తోంది. స్వామి వారి దర్శనం కోసం దూర ప్రాంతాల నుండి వచ్చిన సామాన్య భక్తులను కొండపైకి అనుమతించకపోగా లాఠీఛార్జి చేయడం హేయం.

ప్రశాంత వాతావరణంలో స్వామివారి దర్శనానికి ఏర్పాట్లు చేయడంలో ప్రభుత్వం విఫలమైంది. నిబంధనలకు విరుద్ధంగా 2 వేల మంది వైసీపీ శ్రేణులు తిరుమల కొండ మీద రాజకీయ ఊరేగింపులు చేస్తూ, డ్రోన్లు ఎగురవేస్తుంటే భద్రతాధికారులు ఏం చేస్తున్నట్లు.?

స్వామి వారిని దర్శించుకునే హక్కు ప్రతి భక్తుడికి ఉందని గుర్తించాలి. ప్రభుత్వం ప్రచార ఆర్భాటం పక్కన పెట్టి శ్రీవారి దర్శనానికి భక్తులను అనుమతించాలి.’’

అని టీటీడీ వైఖరిని నిలదీస్తూ ఆయన తన ట్విటర్ ఖాతాలో వరుస పోస్టులు పెట్టారు.

తప్పేమిటి?

భగవంతుని ఎదుట భక్తులందరూ సమానులే. టీటీడీ ఒక నిబంధన పెట్టిన తర్వాత.. దాన్ని విధిగా వారే ఆచరించి ఉండాలి. అలా కాకుండా.. స్థానికులను మాత్రం అనుమతిస్తామని చెప్పిన రోజు.. ముందుగా కొన్న టికెట్లు లేకుండా వచ్చిన రెండు వేల మందిని కేవలం పార్టీ వారు గనుక అనుమతించడం అనేది హేయమైన నిర్ణయం.

అచ్చంగా దేవుడి సేవలో తరించడానికి భక్తితో వచ్చిన వేల మంది భక్తులను కొండ ఎక్కనివ్వకుండానే అడ్డుకోవడం ఒక ఎత్తు కాగా.. నాయకుల ప్రాపకం కోసం, నాయకుల ముఖప్రీతికోసం వారి వెంట పాదయాత్రగా తరలివచ్చిన భక్తులకు పెద్దపీట వేసి.. వారికి దర్శనభాగ్యం కల్పించడం ఘోరం! కేవలం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ట్యాగ్ లైన్ ఉన్నంత మాత్రాన.. నిబంధనలను అతిక్రమించే వారందరూ కూడా.. టీటీడీకి ప్రత్యేక భక్తులు అయిపోతారా? అనే ప్రశ్న ప్రజలనుంచి వినిపిస్తోంది.

Also Read ;- దేవుడైతే మాకేంటి? ప్రభుత్వం మాది.. ఏమైనా చేస్తాం..

అధికారంలోకి వచ్చినప్పటి నుండి ప్రభుత్వం తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్ట మంటగలిపేలా వ్యవహరిస్తోంది. స్వామి వారి దర్శనం కోసం దూర ప్రాంతాల నుండి వచ్చిన సామాన్య భక్తులను కొండపైకి అనుమతించకపోగా లాఠీఛార్జి చేయడం హేయం.(1/3) pic.twitter.com/0uHFf5MCIN

— N Chandrababu Naidu (@ncbn) December 23, 2020

Tags: darshan ticket bookingsdevasthanams executivedevoteesjawahar reddy iasleotoptirumala tirupatiTTD Dual Standards Party Followers are Very Special For DarshanamTTD vigilanceVaikunta Ekadasi festivalycp partyys jagan
Previous Post

దా‘రుణాలు’ ఆపండి: యాప్‌ల నిర్వాహకులకు ఆర్బీఐ హెచ్చరిక

Next Post

అనంత‌లో బ్యాంకు ఉద్యోగిని దారుణ హత్య‌.. ట్ర‌యాంగిల్ ల‌వ్వే కార‌ణ‌మా?

Related Posts

హుదూద్ నుంచి అర్నాబ్ దాకా… చంద్రబాబు మార్క్ క్రైసిస్ మేనేజ్‌మెంట్….!

by లియో డెస్క్
October 29, 2026 6:11 pm

అంతా బాగుంటే పరిపాలన చేయడం ఎవరికైనా ఈజీనే..కానీ ప్రకృతి విరుచుకుపడి, సంక్షోభం అలుముకున్న...

యలహంక ప్యాలెస్‌ సీక్రెట్‌ బయటపెట్టిన టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా …!

by లియో డెస్క్
October 29, 2026 5:10 pm

దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ ఫ్యామిలీలో వై.ఎస్‌.జగన్, షర్మిల మధ్య నడుస్తున్న ఆస్తుల వివాదం...

తండ్రి కోటని కూల్చిన కొడుకు పులివెందులలో జగన్‌ పరాభవం

by లియో డెస్క్
October 28, 2026 9:20 pm

దశాబ్దాలుగా కడప గడ్డపై తిరుగులేని ఆధిపత్యం చలాయించిన వైఎస్ కుటుంబ రాజకీయ సామ్రాజ్యం.....

కుప్పం రగిలింది..పుంగనూరు, పులివెందులలో తెలుగు తమ్ముళ్ల విజయం…!

by లియో డెస్క్
October 28, 2026 7:56 pm

ఒకప్పుడు అధికార మదంతో ప్రత్యర్థుల గొంతునొక్కి, రాక్షసానందం పొందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి...

స్కిల్ కేసులో అసలు నిజం ఇది…. చంద్రబాబు అరెస్ట్‌పై IAS P.V.రమేష్ సంచలనం.!

by లియో డెస్క్
October 28, 2026 7:41 pm

తెలుగు రాష్ట్రాల్లో రాజకీయంగా సంచలనం సృష్టించిన స్కిల్ డెవలప్‌మెంట్ కేసుకు సంబంధించి అప్పట్లో...

ఆల్‌ ది బెస్ట్‌..వైసీపీ అభ్యర్ధులకి సుప్రీం విషెస్‌..జగన్‌ మైండ్‌ బ్లాంక్‌.!

by లియో డెస్క్
October 28, 2026 5:54 pm

ఏపీ స్థానిక ఎన్నికల వివాదంలో వైసీపీకి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఎన్నికలను ఆపాలని, ఏకగ్రీవాలను...

పులివెందులలో పులి ఢమాల్‌ చొక్కా మడతబెట్టలోపే మడతపెట్టారు…!

by లియో డెస్క్
October 28, 2026 4:21 pm

రాయలసీమ రాజకీయ చరిత్రలోనే ఊహించని సంచలనం నమోదైంది. దశాబ్దాలుగా వైఎస్ కుటుంబానికి తిరుగులేని...

తుఫాన్‌ వేగంతో సహాయక చర్యలు.. 32 వేల మందితో సీఎం చంద్రబాబు సమీక్ష..

by లియో డెస్క్
October 28, 2026 3:57 pm

ఆర్నబ్ తుపాను ప్రభావంతో కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పెనుగాలులు, కుండపోత...

సుప్రీంలో జగన్ చివరి ఆశ ఢమాల్… కూటమికి భారీ విజయం..!

by లియో డెస్క్
October 27, 2026 8:00 pm

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలను అడ్డుకునేందుకు, నామినేషన్ల గడువు పొడిగింపు పేరిట ప్రక్రియను...

డిసెంబర్‌ 4న ఏపీకి మోదీ, అమిత్ షా.. దద్దరిల్లనున్న అమరావతి..!

by లియో డెస్క్
October 27, 2026 7:34 pm

ఆంధ్రప్రదేశ్‌లోని ఆధ్యాత్మిక నగరం తిరుపతి అతిపెద్ద జాతీయ భద్రతా సదస్సుకు వేదిక కాబోతోంది....

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

కుప్పం రగిలింది..పుంగనూరు, పులివెందులలో తెలుగు తమ్ముళ్ల విజయం…!

స్కిల్ కేసులో అసలు నిజం ఇది…. చంద్రబాబు అరెస్ట్‌పై IAS P.V.రమేష్ సంచలనం.!

తండ్రి కోటని కూల్చిన కొడుకు పులివెందులలో జగన్‌ పరాభవం

యలహంక ప్యాలెస్‌ సీక్రెట్‌ బయటపెట్టిన టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా …!

హుదూద్ నుంచి అర్నాబ్ దాకా… చంద్రబాబు మార్క్ క్రైసిస్ మేనేజ్‌మెంట్….!

పులివెందులలో పులి ఢమాల్‌ చొక్కా మడతబెట్టలోపే మడతపెట్టారు…!

ఆల్‌ ది బెస్ట్‌..వైసీపీ అభ్యర్ధులకి సుప్రీం విషెస్‌..జగన్‌ మైండ్‌ బ్లాంక్‌.!

స్థానిక ఎన్నికలు..జగన్‌ని భయపెడుతున్న ప్రీ పోల్ సర్వే.!

దూకుడుతో పార్టీకి మేలా.. కీడా?

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

ముఖ్య కథనాలు

స్కిల్ కేసులో అసలు నిజం ఇది…. చంద్రబాబు అరెస్ట్‌పై IAS P.V.రమేష్ సంచలనం.!

తుఫాన్‌ వేగంతో సహాయక చర్యలు.. 32 వేల మందితో సీఎం చంద్రబాబు సమీక్ష..

డిసెంబర్‌ 4న ఏపీకి మోదీ, అమిత్ షా.. దద్దరిల్లనున్న అమరావతి..!

పోలీసులని బూతులు తిట్టాడు.. పరార్‌ అయ్యాడు.. ఏపీలో తోపుదుర్తి మిస్సింగ్..!

షర్మిలకి అండగా లోకేష్‌.. సంచలన ట్వీట్‌..!

వైసీపీని నిండా ముంచిన ABN రాధాకృష్ణ అల్లుడు..

అనుమానం నుంచి ప్రశంసల దాకా..లోకేష్ స్పీడ్‌కు మోహన్‌దాస్ ఫిదా..!

గొడవలు చేయకుండా ఏం పీకుతున్నారు.. చెవిరెడ్డి, బుగ్గన, బైరెడ్డిపై జగన్ సీరియస్..!

మా*, మా** లం**.. దళితులపై వైసీపీ నేత సుధాకర్ రెడ్డి బూతు పురాణం..!

ట్రంప్‌కి షాక్‌ ఇచ్చేలా అమరావతి క్వాంటమ్ కంప్యూటర్‌.. దటీజ్‌ చంద్రబాబు..

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

హుదూద్ నుంచి అర్నాబ్ దాకా… చంద్రబాబు మార్క్ క్రైసిస్ మేనేజ్‌మెంట్….!

యలహంక ప్యాలెస్‌ సీక్రెట్‌ బయటపెట్టిన టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా …!

తండ్రి కోటని కూల్చిన కొడుకు పులివెందులలో జగన్‌ పరాభవం

కుప్పం రగిలింది..పుంగనూరు, పులివెందులలో తెలుగు తమ్ముళ్ల విజయం…!

స్కిల్ కేసులో అసలు నిజం ఇది…. చంద్రబాబు అరెస్ట్‌పై IAS P.V.రమేష్ సంచలనం.!

ఆల్‌ ది బెస్ట్‌..వైసీపీ అభ్యర్ధులకి సుప్రీం విషెస్‌..జగన్‌ మైండ్‌ బ్లాంక్‌.!

పులివెందులలో పులి ఢమాల్‌ చొక్కా మడతబెట్టలోపే మడతపెట్టారు…!

తుఫాన్‌ వేగంతో సహాయక చర్యలు.. 32 వేల మందితో సీఎం చంద్రబాబు సమీక్ష..

సుప్రీంలో జగన్ చివరి ఆశ ఢమాల్… కూటమికి భారీ విజయం..!

డిసెంబర్‌ 4న ఏపీకి మోదీ, అమిత్ షా.. దద్దరిల్లనున్న అమరావతి..!

సినిమా

రాత్రికి రాత్రే రోడ్డును తవ్వేసి..వైసీపీ మార్క్ విధ్వంసం..!

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌..APPSC ఉద్యోగ నోటిఫికేషన్లు రిలీజ్.!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

జనరల్

హుదూద్ నుంచి అర్నాబ్ దాకా… చంద్రబాబు మార్క్ క్రైసిస్ మేనేజ్‌మెంట్….!

యలహంక ప్యాలెస్‌ సీక్రెట్‌ బయటపెట్టిన టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా …!

తండ్రి కోటని కూల్చిన కొడుకు పులివెందులలో జగన్‌ పరాభవం

కుప్పం రగిలింది..పుంగనూరు, పులివెందులలో తెలుగు తమ్ముళ్ల విజయం…!

స్కిల్ కేసులో అసలు నిజం ఇది…. చంద్రబాబు అరెస్ట్‌పై IAS P.V.రమేష్ సంచలనం.!

ఆల్‌ ది బెస్ట్‌..వైసీపీ అభ్యర్ధులకి సుప్రీం విషెస్‌..జగన్‌ మైండ్‌ బ్లాంక్‌.!

పులివెందులలో పులి ఢమాల్‌ చొక్కా మడతబెట్టలోపే మడతపెట్టారు…!

తుఫాన్‌ వేగంతో సహాయక చర్యలు.. 32 వేల మందితో సీఎం చంద్రబాబు సమీక్ష..

సుప్రీంలో జగన్ చివరి ఆశ ఢమాల్… కూటమికి భారీ విజయం..!

డిసెంబర్‌ 4న ఏపీకి మోదీ, అమిత్ షా.. దద్దరిల్లనున్న అమరావతి..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist