టాలీవుడ్ లో ‘లోఫర్’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన బాలీవుడ్ భామ దిశా పటాని. ఈ సినిమాలో మెగా హీరో వరుణ్ తేజ్ సరసన నటించింది. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన ‘లోఫర్’ ఆశించిన స్ధాయిలో ఆకట్టుకోలేదు. దీంతో దిశా పటానికి టాలీవుడ్ లో ఆశించిన స్ధాయిలో అవకాశాలు రాలేదు. బాలీవుడ్ లో వరుసగా ఆఫర్స్ వచ్చాయి. అనతి కాలంలోనే అక్కడ బిజీ హీరోయిన్ అయ్యింది.. కెరీర్ లో దూసుకెళుతుంది.

సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటూ ఎప్పుడూ వార్తల్లో ఉండే దిశా పటానీ మరోసారి వార్తల్లో నిలిచింది. దిశా పటాని ఏక్ విలన్ రిటర్న్ అనే సినిమా చేస్తుంది. ఈ చిత్రానికి మెహిత్ సూరి దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల తన బెస్ట్ ఫ్రెండ్ పెళ్లికి వెళ్లి సెలబ్రేషన్స్ లో పాల్గొంది. ఈ సెలబ్రేషన్స్ లో దిశా పటానీ లుక్ చూసి అక్కడ ఉన్నవారితో పాటు టైగర్ ఫ్రాఫ్ సిస్టర్ కృష్ణ ష్రాఫ్ కూడా స్టన్ అయ్యింది.
సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే దిషా తన ఇన్ స్టాగ్రామ్ ద్వారా ఒక వీడియోను షేర్ చేసింది. పెళ్లిలో తెల్లటి డ్రెస్ తో పర్ ఫెక్ట్ హెయిర్ తో అదిరింది అనే లుక్ తో డ్యాన్స్ చేసింది. అంతే.. మ్యారేజ్ సెలబ్రేషన్స్ లో దిశా పటాని హైలెట్ అయ్యింది. ఆమె ముత్యాలతో రూపొందించిన చెవి రింగులు, గోల్డన్ నెక్లస్.. పెట్టుకుని వావ్ అనిపించింది. అయితే..తనని ఇంత అందంగా ముస్తాబు చేసిన వారెవరో కూడా తెలియచేసింది. ఇంతకీ ఎవరంటే.. హెయిర్ అండ్ మేకప్ అంతా ఆస్ధానశర్మ చేసిందని చెప్పింది. దిశా పటానీ పోస్ట్ పై కృష్ణ ఫ్రాఫ్, ఖుష్బూ పటానీ స్పందిస్తూ.. లుకింగ్ గార్జియస్ అని కామెంట్ చేశారు.
Must Read ;- ప్రభాస్ మూవీలో దిశాని తీసుకోకపోవడానికి కారణం ఇదే!










